రేవంత్ ఎఫెక్ట్: రాహుల్‌తో విజయశాంతి భేటీ, ఎఐసిసిలో కీలకపదవి?
సినీ నటి విజయశాంతి ఎఐసిసి ఉపాధ్యక్షురాలు రాహుల్‌గాంధీతో మంగళవారం నాడు సమావేశమయ్యారు. విజయశాంతికి పార్టీలో కీలకమైన పదవిని ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది.
హైదరాబాద్: సినీ నటి విజయశాంతి ఎఐసిసి ఉపాధ్యక్షురాలు రాహుల్‌గాంధీతో మంగళవారం నాడు సమావేశమయ్యారు. విజయశాంతికి పార్టీలో కీలకమైన పదవిని ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది.మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన ముందున్న లక్ష్యమని విజయశాంతి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేయనున్నట్టు ఆమె చెప్పారు.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. ఇందులో భాగంగానే రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వనించింది. రేవంత్‌రెడ్డితో పాటు కొందరు టిడిపి కీలక నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా విజయశాంతి హైద్రాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ కుంతియాతో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత విజయశాంతి రాహుల్‌గాంధీతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

రాహుల్‌తో విజయశాంతి భేటీ
ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి సమావేశమయ్యారు. ఢిల్లీలో రాహుల్‌తో విజయశాంతి మంగళవారం నాడు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. 2014 ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు కన్పించిన విజయశాంతి రాహుల్‌తో భేటీ కావడంతో ఆమె రాజీకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.గతంలోనే ఆమెకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీలో బాధ్యతలను ఇవ్వాలని నిర్ణయించినట్టు ఎఐసిసి ప్రకటించింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో రాహుల్‌తో విజయశాంతి భేటీ కావడం రాజకీయవర్గాల్లో ఉత్కంఠగా మారింది.

కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యం
పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటానని విజయశాంతి ప్రకటించారు. ఎన్నికల్లో విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం నిర్వహించనున్నట్టు ఆమె చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని విజయశాంతి ప్రకటించారు.

ఎఐసిసిలో కీలకపదవి
సినీ నటి విజయశాంతికి ఎఐసిసిలో కీలకపదవిని కూడ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడ పార్టీ వర్గాల్లో ఉంది.గతంలోనే ప్రచార కమిటీలో విజయశాంతితో పాటు అజహరుద్దీన్‌కు కూడ బాధ్యతలను కేటాయించారు. అయితే రేవంత్‌రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనకు ప్రచార కమిటీ ఛైర్మెన్ బాధ్యతలను అప్పగించనున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలోనే విజయశాంతికి ప్రచార కమిటీతో పాటు ఎఐసిసి కార్యదర్శిగా బాధ్యతలు కేటాయించే అవకాశం కూడ లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపే దిశగా
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపే దిశగా ఆ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. టిఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా తన బలగాన్ని, బలాన్ని పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే బలమైన నేతలను తమ పార్టీలోకి ఆహ్వనిస్తోంది. టిఆర్ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో గద్దె దింపే విశ్వసాన్ని క్యాడర్‌లో నింపుతోందని ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

మారుతున్న రాజకీయ సమీకరణాలు
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ తర్వాత టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ముఖాముఖి పోటీ సాగుతోందా, ఇంకా ఇతర కూటములు రంగంలోకి వస్తాయా అనే విషయమై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. అంతేకాదు ఆయా జిల్లాల్లో నేతల వలసల కారణంగా ఆయా పార్టీల బలబలాల్లో కూడ మార్పులు చోటుచేసుకొంటున్నాయని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.
-
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం










Click it and Unblock the Notifications