రోజులు దగ్గరపడితేనే ఇలాంటి పెడబుద్ధులు పుట్టుకొస్తాయి: ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిపై విజయశాంతి!!
తెలంగాణ రాజకీయాలలో తాజా రాజకీయ పరిణామాలపై విజయశాంతి స్పందించారు. ఇక రాష్ట్రంలోని పరిస్థితులపై కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేయడంతో పాటు, బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై బీజేపీ శ్రేణుల దాడుల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ధర్మపురి అరవింద్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన విజయశాంతి తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అరాచక, అనాగరిక పరిస్థితులు నెలకొన్నయో నేడు జరిగిన పరిణామాలు స్పష్టంగా చెబుతున్నాయని విజయశాంతి పేర్కొన్నారు.

ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి .. రోజులు దగ్గరపడితేనే పెడబుద్ధులు
విమర్శలకు జవాబు చెప్పడం చేతగాక ప్రజాప్రతినిధి అయిన ఎంపీ అర్వింద్ గారి ఇంటిపై గూండాలతో దాడి చేయించడం, వారి తల్లిగారిని బెదిరించడం, ఆ ఇంటివారిని భయభ్రాంతుల్ని చెయ్యడం చూస్తుంటే రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని వేరే చెప్పాల్సిన పని లేదు అని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు సముచిత స్థానం ఇస్తున్నామని, మహిళా రక్షణకు కట్టుబడి ఉన్నామని పదే పదే చెప్పుకునే టిఆర్ఎస్ సర్కారు ఇక ఆ మాట ఎత్తే అర్హతను పూర్తిగా కోల్పోయిందని విజయశాంతి పేర్కొన్నారు . ఇక అంతేకాదుగర్వం పెరిగిపోయి రోజులు దగ్గర పడినప్పుడే ఇలాంటి పెడబుద్దులు పుట్టుకొస్తాయి అంటూ విజయశాంతి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ధాన్యం పైసలు ఇవ్వటం లేదని ప్రభుత్వం తీరుపై విజయశాంతి విమర్శలు
ఇక అంతకు ముందు తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం పైసలు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం అంటూ తెలంగాణ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు విజయశాంతి. తెలంగాణలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై 15 రోజులు గడచినా ఇంకా వడ్లు అమ్మిన రైతన్నలకు పైసలు రావడం లేదని పేర్కొన్నారు. రైస్‌మిల్లర్లతో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అగ్రిమెంట్ ప్రాసెస్ ఆలస్యం కావడంతో పేమెంట్ జరగడం లేదని విజయశాంతి విమర్శించారు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని విజయశాంతి తెలిపారు.

అన్నదాతలను తెలంగాణా సర్కార్ అరిగోస పెడుతుందన్న విజయశాంతి
సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 10,361 మంది రైతుల నుంచి 56,529 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో 53,111 మెట్రిక్ టన్నులు రైస్ మిల్లులకు తరలించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.116 కోట్లు చెల్లించాల్సి ఉండగా, కేవలం 1,176 మంది రైతన్నలకు రూ.14.44 కోట్లు మాత్రమే చెల్లించారు అంటూ విజయశాంతి లెక్కలు చెప్పారు. ఇంకా 9,185 మంది రైతులకు రూ.102 కోట్లు పెండింగ్ ఉన్నాయని పేర్కొన్న విజయశాంతి ఒక్క సంగారెడ్డి జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. అన్నదాతలు ఇలా ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని విజయశాంతి అసహనం వ్యక్తం చేశారు. అన్నదాతలను అరిగోసలు పెడుతున్న కేసీఆర్ సర్కార్ కు తెలంగాణ రైతాంగమే తగిన సమాధానం చెబుతుందని విజయశాంతి పేర్కొన్నారు.
కవితను బీజేపీలో చేరాలని ఒత్తిడి తెస్తే ఎందుకు ట్రాప్ చెయ్యలేదు? ఎందుకు ఫిర్యాదు చెయ్యలేదు?












Click it and Unblock the Notifications