వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కవితను బీజేపీలో చేరాలని ఒత్తిడి తెస్తే ఎందుకు ట్రాప్ చెయ్యలేదు? ఎందుకు ఫిర్యాదు చెయ్యలేదు?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ తర్వాత ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తర్వాత, సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవితను కూడా బిజెపిలో చేరాలని ఒత్తిడి తీసుకువచ్చారని కేసీఆర్ పేర్కొన్నారు. ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఏదైనా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు పది నెలలు మాత్రమే సమయం ఉందని, బిజెపితో కచ్చితంగా పోరాడతామని వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ తర్వాత సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర చర్చ ప్రారంభమైంది.

కవితకు బీజేపీలో చేరాలని ఒత్తిడి ఎపిసోడ్ .. తెలంగాణాలో రచ్చ

కవితకు బీజేపీలో చేరాలని ఒత్తిడి ఎపిసోడ్ .. తెలంగాణాలో రచ్చ

బీజేపీలోకి సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఎవరు ఆహ్వానించలేదని బిజెపి నేతలు కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసిన సీఎం కేసీఆర్ ని ఎవరూ పట్టించుకోవడం లేదని, అలాంటప్పుడు కవిత ని ఎవరు పట్టించుకుంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా ధర్మపురి అరవింద్ ఎమ్మెల్సీ కవిత ను టార్గెట్ చేసి కవిత కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసిందని, మల్లికార్జున ఖర్గే తో మాట్లాడిందని దీనికి సంబంధించి తన వద్ద సమాచారం ఉందని వ్యాఖ్యలు చేశారు.

దీంతో భగ్గుమన్న కవిత నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. నిజామాబాద్ చౌరస్తాలో ధర్మపురి అరవింద్ ను చెప్పుతో కొడతానన్న కవిత మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

కవిత వారి పేర్లు ఎందుకు చెప్పలేదు.. ఎందుకు వారిని ట్రాప్ చెయ్యలేదు?

కవిత వారి పేర్లు ఎందుకు చెప్పలేదు.. ఎందుకు వారిని ట్రాప్ చెయ్యలేదు?

తనకు బీజేపీ నేతలు ఆఫర్ చేసిన విషయం వాస్తవమేనని పేర్కొన్న కవిత షిండే మోడల్ ఇక్కడ అమలు చేయడంపై మాట్లాడారని పేర్కొన్నారు. ఇంత చెప్పిన కవిత అసలు తనను బిజెపిలోకి ఆహ్వానించిన నేత ఎవరు అన్నది చెప్పలేదు. ఇక ఇదే సమయంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన వారిని చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ట్రాప్ చేసిన టిఆర్ఎస్ పార్టీ, కవిత విషయంలో, పార్టీ ఫిరాయింపుకు ప్రయత్నించిన వారిని ఎందుకు ట్రాప్ చేయలేదు అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కవితను సంప్రదించిన వారి పేర్లు ఎందుకు బయటపెట్టటం లేదు?

కవితను సంప్రదించిన వారి పేర్లు ఎందుకు బయటపెట్టటం లేదు?

నిజంగానే కవితను బిజెపిలోకి ఆహ్వానిస్తే ఎవరు తనను ఆహ్వానించారు అన్న విషయాన్ని కవిత ఎందుకు బయట పెట్టడం లేదని కూడా చర్చ జరుగుతుంది.అసలు కవిత ను సంప్రదించిన వ్యక్తులు ఎవరు? ఆమెకు చేసిన ఆఫర్ ఏంటి? ఒకవేళ కవితను పార్టీ మారాలని ఒత్తిడి తెస్తే కవిత ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అసలు కెసిఆర్, కవిత చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా? వాళ్లు చెప్పిందే నిజమైతే ఒక్క ఆధారం కూడా ఎందుకు బయట పెట్టలేదు? వంటి అనేక అంశాలపై ఇప్పుడు తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది.

అసలు ఆఫర్ చేసిన బీజేపీ నేతల పేర్లు చెప్పకుండా ఎందుకీ రచ్చ?

అసలు ఆఫర్ చేసిన బీజేపీ నేతల పేర్లు చెప్పకుండా ఎందుకీ రచ్చ?

అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజలలోనూ ఈ వ్యవహారం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలతో చెప్పుతో కొడతా అని సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత, ఈ వ్యవహారాన్ని ఎందుకు కాంప్లికేట్ చేస్తున్నారు అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ధర్మపురి అరవింద్ ఇంటి పై దాడి చేయడం, ప్రస్తుతం చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో అసలు కవితను బిజెపిలోకి ఆహ్వానించింది ఎవరు? ఎందుకు కవితకు ఆఫర్ చేశారు? బీజేపీ లో చేరడానికి ఆమెపై ఎటువంటి ఒత్తిడి తీసుకువచ్చారు? అన్న ప్రశ్నలకు సమాధానం కవిత నే చెప్పాల్సి ఉంది.

English summary
If Kavitha was pressured to join BJP, why was they are not trapped? Why didn't you complain? Who are the BJP leaders who offered her? The debate is raging in political circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X