తెలంగాణా పరువు తీసిన కవిత; కేసీఆర్ మాట్లాడరేం: విజయశాంతి సూటిప్రశ్నలు!!

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి తనదైన శైలిలో మండిపడ్డారు. బీజేపీ నాయకుల పై కెసిఆర్ కూతురు పరువు నష్టం దావా వేయడం కాదు కెసిఆర్ కుటుంబం పై తెలంగాణ ప్రజలు పరువు నష్టం దావా వేయాలని అనుకుంటున్నారని విజయశాంతి పేర్కొన్నారు. అవినీతిలో కేసీఆర్ కుటుంబం లిమిట్ దాటిందని విజయశాంతి వెల్లడించారు. బీజేపీ శ్రేణులు తిరగబడితే మీరు తట్టుకోలేరని విజయశాంతి తేల్చిచెప్పారు.

లిక్కర్ స్కాం లో మహిళ .. తెలంగాణా రాష్ట్రం పరువు తీసిన కవిత: విజయశాంతి ఫైర్

లిక్కర్ స్కాం లో మహిళ .. తెలంగాణా రాష్ట్రం పరువు తీసిన కవిత: విజయశాంతి ఫైర్

ఒక మహిళ లిక్కర్ స్కామ్ లో ఉండటం ఏమిటి అని ప్రశ్నించిన విజయశాంతి కవిత తెలంగాణ రాష్ట్రం పరువు తీసింది అంటూ మండిపడ్డారు. బీజేపీ నేతల పైన పరువు నష్టం దావా వేయడంపై సీరియస్ గా స్పందించిన విజయశాంతి 33 జిల్లా కోర్టులలో పిటీషన్లు వేస్తే బీజేపీ భయపడుతుందా అని ప్రశ్నించారు. నిప్పులేనిదే పొగ రాడని, కవిత ప్రమేయం లేకుండా ఆమె పేరు బయటకు రాదని విజయశాంతి పేర్కొన్నారు.

కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్రం నుండి వెలి వెయ్యాలి

కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్రం నుండి వెలి వెయ్యాలి

కెసిఆర్ కుటుంబాన్ని రాష్ట్రం నుంచి వెలి వేయాలంటూ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం మొత్తంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అంత అవినీతి చేయలేదని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు. సరైన సమయంలో మిమ్మల్ని ఈడి కచ్చితంగా పిలుస్తుంది అని పేర్కొన్న విజయశాంతి, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వాటంతటవే బయటకు వస్తాయి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించిన విజయశాంతి కెసిఆర్ ప్రజాధనాన్ని కొల్లగొట్టి తన సొంత ఖజానా నింపుకున్నారని ఆరోపించారు.

టీఆర్ఎస్ పార్టీ కౌంట్ డౌన్ మొదలైంది

ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీజేపీ నేతలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పిన విజయశాంతి బిజెపి నేతల అక్రమ అరెస్టులపై మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీ కౌంట్ డౌన్ ప్రారంభమైందని, బిజెపిని అడ్డుకోవడానికి టిఆర్ఎస్ చేసే అక్రమ ప్రయత్నాలు చెల్లవని విజయశాంతి వెల్లడించారు. కెసిఆర్ కుమార్తె పై ఆరోపణలు వచ్చినప్పుడు కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని విజయశాంతి ప్రశ్నించారు.బండి సంజయ్ పాదయాత్ర ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, కార్యకర్తలను కొడుతున్నారని, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అయినప్పటికీ భయపడే ప్రసక్తే లేదని బిజెపి నేత విజయశాంతి తేల్చిచెప్పారు.

త్వరలో టీఆర్ఎస్ పార్టీలో మొదటి వికెట్ పడొచ్చు

త్వరలో టీఆర్ఎస్ పార్టీలో మొదటి వికెట్ పడొచ్చు

రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని తాము చెబుతున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి, రాష్ట్రంలో భూ కుంభకోణం, ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం ఇలా అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని తాము చెబుతున్నామని విజయశాంతి పేర్కొన్నారు. త్వరలో కెసీఆర్ కుటుంబ అవినీతి అంతా బయటకు వస్తుందని విజయశాంతి పేర్కొన్నారు. త్వరలో టీఆర్ఎస్ పార్టీలో మొదటి వికెట్ పడొచ్చని పేర్కొన్న విజయశాంతి కవితను టార్గెట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+