బీజేపీ ఆఫీసు నుంచి వెళ్లిపోయిన విజయశాంతి: మాజీ ముఖ్యమంత్రే కారణమా?
హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలతంతా హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ విజయశాంతి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన కూడా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే విజయశాంతి ఆ కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే, సోషల్ మీడియా వేదికగా తాను ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఆమె వెల్లడించారు.

'బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారి ప్రమాణస్వీకార కార్యక్రమం మధ్యలో వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు.అది, సరి కాదు.. కిషన్ రెడ్డి గారిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చాను. ఐతే, నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం, అసాధ్యం ఆ పరిస్థితి వల్ల ముందుగానే వెళ్లవలసి వచ్చింది..జై శ్రీరామ్.. హర హర మహాదేవ.. జై తెలంగాణ' అని విజయశాంతి తన సోషల్ మీడియాలో ఖాతాలో వెల్లడించారు.
బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారి ప్రమాణస్వీకార కార్యక్రమం మధ్యలో
— VIJAYASHANTHI (@vijayashanthi_m) July 21, 2023
వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు.
అది, సరి కాదు.
కిషన్ రెడ్డి గారిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చాను.
ఐతే, నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని… pic.twitter.com/l22P9lvyxm
కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా విజయశాంతి ఈ పోస్టు చేసినట్లు ఉందని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు తనవంతుగా ప్రయత్నించారు. దీంతో అదే విషయాన్ని ఇప్పుడు విజయశాంతి ప్రస్తావించినట్లు భావిస్తున్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications