హరీశ్ రావు వ్యాఖ్యలకు విజయశాంతి స్ట్రాంగ్ కౌంటర్, కేసీఆర్‌పైనా
కాంగ్రెస్ నేత విజయశాంతి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇటీవల మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి ఘాటుగా స్పందించారు.
సుమారు 10 సంవత్సరాల తెలంగాణ ఖజానా మొత్తం కొల్లగొట్టి, 5 లక్షల కోట్ల అప్పు మన నెత్తిన పెట్టి ఎల్లిన గత దుర్మార్గ బీఆర్ఎస్ ప్రభుత్వం, అందుకు బాధ్యులైన నాటి బీఆర్ఎస్ మంత్రులు మూడు దినాలల్లనే నూతన సర్కారు అన్ని హామీలను అమలు చేయాలని ప్రశ్నించడం ప్రతిపక్షంగా అన్ని తెలిసి చేస్తున్న మోసపు ప్రకటనలు ప్రయత్నం, ఓటమి తట్టుకోలేని వ్యక్తుల వివాదం అని మండిపడ్డారు విజయశాంతి.

'విజ్ఞత, బాధ్యతాయుత ధోరణితో ఉండే గత ఆర్థిక మంత్రి
హరీశ్ రావుతో కూడా ఇట్ల ఎందుకు మాట్లాడిస్తున్నరో దవాఖానలో ఉన్న కేసీఆర్... తెల్వదు.. ఐనా, మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పదు అన్నది వాస్తవం... అందుకై మన ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని విమర్శించే శక్తులను సమర్ధవంతంగా తిప్పికొట్టి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యాచరణను నిరంతరం ప్రజలకు చేర్చవలసిన బాధ్యత ఈ సందర్బంగా తెలంగాణ ల బీఆర్ఎస్ నియంతృత్వ గడిల నుంచి విముక్తి కై కొట్లాడి నేటి ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకై పనిచేసిన మన వంటి తెలంగాణ ప్రజాస్వామ్యవాదులు పై ప్రస్తుతం తప్పక ఉన్నది' అని విజయశాంతి వ్యాఖ్యానించారు.
మరోవైపు, రైతుబంధు ఎప్పడిస్తారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించిన నేపథ్యంలో వరుసగా మంత్రులు స్పందిస్తున్నారు. రైతుకు పెట్టుబడి 100 శాతం ఇస్తామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం డిసెంబర్ ఆఖరిలో ఇచ్చేదని.. తాము కూడా అలాగే ఇస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి రాగానే రైతుబంధు ఎప్పుడు ఇస్తారని మాజీ మంత్రులు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా గజ్వేల్‌కు వచ్చిన పొన్నం ప్రభాకర్‌కు డీసీసీ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తే.. 9న ఆరు గ్యారంటీలలో 2 గ్యారంటీలను ప్రారంభించామని తెలిపారు. రవాణా శాఖ పరిధిలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించామని వెల్లడించారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచామన్నారు.
ఇచ్చిన ప్రకారం 6 గ్యారంటీలను 100 రోజుల్లో ప్రారంభిస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వాన్ని నడవనీయమని ప్రతిపక్షాలు అంటున్నారని మండిపడ్డారు. రైతుకు పెట్టుబడి 100 శాతం ఇస్తామన్నారు. గతంలో ఇచ్చిన విధంగానే రైతుబంధు ఇస్తామని, కేసీఆర్ గజ్వేల్ నుంచి గెలిచాక ఒక్కసారైనా ఇక్కడి ప్రజలను కలవలేదని మంత్రి పొన్నం మండిపడ్డారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications