ఇది అరాచక పాలన.!ఆసుపత్రుల పనితీరు పరిశిలిస్తే కేసులా.!టీ సర్కార్ ను సూటిగా ప్రశ్నించిన విజయశాంతి.!
సిద్దిపేట/హైదరాబాద్ : అధికార గులాబీ ప్రభుత్వంపై బీజేపి నాయకురాలు విజయశాంతి మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వానిది వందకు వందకు వాతం అరాచక ప్రభుత్వమని మండిపడ్డారు. పోలీసులను అడ్డంపెట్టుకుని ఎన్ని సంవత్సారాలు నెట్టుకొస్తారని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసారు. అభివృద్దిలో భారతదేశంలోనే మొదటి స్థానానికి పోటీపడుతుందని చెప్పుకుంటున్న సిద్దిపేటలో జరిగిన సంఘటనలకు ఎవరు సమాధానం చెబుతారని విజయశాంతి ప్రశ్నించారు. సిద్దిపేటలో ప్రజాస్వామ్యం ఉందా లేక నిరంకుశ నిజాం రాజ్యం నడుస్తోందా అని అన్నారు.
సర్కార్ హాస్పిటల్ లో పరిస్థితులను పరిశీలించడానికి వెళ్తే బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా? కోవిడ్ నిబంధనలకు లోబడి పీపీఈ కిట్లు వేసుకుని హాస్పిటల్ లోకి వెళ్తే డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు బనాయిస్తారా? ఇదెక్కడి న్యయమని ప్రభుత్వాన్ని విజయశాంతి నిలదీసారు.రోజు లాక్‌డౌన్ ను ఉల్లంఘిస్తున్న వాళ్లపై ఎంత మంది పై కేసులు పెట్టి ఎంతమందిని కోర్టు ముందు ప్రవేశ పెడుతున్నారని ప్రశ్నించారు. సిద్దిపేట అభివృద్ధి, హరీష్ రావు చెప్పుకుంటున్న అభివృద్ధి అంత డొల్ల అని తేలిపోయిందని, సిద్దిపేటలో డమ్మీ అభివృద్హి బుడగ త్వరలో పగలడం ఖాయమని ఎద్దేవా చేసారు.

సిద్దిపేట ఆసుపత్రుల్లో కరోనా పేషేంట్లను పట్టించుకోవట్లేదని వాళ్ళ బంధువులు, టీఆరెస్ నేతలే వీడియో మెసేజ్ లు పెట్టారని స్పష్టం చేసారు. సిద్దిపేట సర్కార్ దవాఖానకు పోతే చచ్చినట్లే అని పేషేంట్ల బంధువులు చెబుతుంటే అక్కడి చిన్న దొరకు, ఫామ్ హౌజ్ పెద్ద దొరకు వినిపించడం లేదా అని నిలదీసారు. వాస్తవాలు చూసేందుకు హాస్పిటల్ కు వెళ్లిన సిద్దిపేట జిల్లా బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు అరుణా రెడ్డి, ప్రధాన కార్య దర్శి పద్మ గౌడ్ పై కేసులు పెట్టడం ఎంతవరకు సంమంజసమని విజయశాంతి మండిపడ్డారు. పీపీఈ కిట్లు లేకుండా గాంధీ, ఎంజీఎం లో తిరిగిన సీఎం పై ఎం కేసు పెట్టాలని రాములమ్మ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications