వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందస్తు ఎన్నికల తర్వాత ప్రజాధనంతో ఇంద్రభవనంలా ప్రగతి భవన్ నిర్మాణం: కేసీఆర్ చేసింది చెప్పిన విజయశాంతి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బిజెపి సీనియర్ నాయకురాలు విజయశాంతి మరోమారు విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ ప్రగల్బాలేనని మరోమారు దుమ్మెత్తిపోశారు. ఈసారి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ లెక్కలు చెప్పిన విజయశాంతి కేసీఆర్ సర్కార్ ఇప్పటి వరకు చేసిన పనిని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పారు. చిన్న అవకాశం దొరికినా తెలంగాణ సీఎం కేసీఆర్ పై, టిఆర్ఎస్ పార్టీపై, మంత్రి కేటీఆర్ పై తెలంగాణ రాములమ్మ, బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూనే ఉన్నారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచాక సీఎం కేసీఆర్ చేసిందిదే

ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచాక సీఎం కేసీఆర్ చేసిందిదే

టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని విజయశాంతి తేల్చి చెప్పారు. ఎన్నో హామీలు ఇచ్చి 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టిఆర్ఎస్, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల కోసం ఏం చేసిందో చెప్పాలని విజయశాంతి ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత రాష్ట్ర ప్రజల కోసం చేసిందేమీ లేదని పేర్కొన్న విజయశాంతి వందల కోట్ల ప్రజల ధనంతో ఇంద్రభవనం లాంటి ప్రగతి భవన్ ను మాత్రం సంవత్సర కాలంలోనే సీఎం కేసీఆర్ నిర్మించుకున్నారని గుర్తు చేశారు. కానీ ఇన్ని సంవత్సరాలు అవుతున్నా డబల్ బెడ్రూమ్ ఇళ్ళు మాత్రం పెద్దగా నిర్మించలేక పోయారని విజయశాంతి కేసీఆర్ చేసిందిదే అంటూ పేర్కొన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ దుస్థితిపై విజయశాంతి

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ దుస్థితిపై విజయశాంతి

ఇప్పటికే పూర్తయిన కొన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి అని విజయశాంతి విమర్శలు గుప్పించారు. కొన్ని ఇళ్ళు అప్పుడే శిధిలావస్థకు చేరుకున్నాయని, చాలా ఇళ్ళు బీటలు వారుతున్నాయని విజయశాంతి తెలిపారు. కొన్ని చోట్ల లబ్దిదారులు కాని వాళ్ళు ఇళ్ళలోకి చేరిపోయి నివాసాలు ఉంటున్నారని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి సీఎం కేసీఆర్ కు మాట్లాడడం పరిపాటిగా మారిందని పేర్కొన్న విజయశాంతి ఎన్నికల తర్వాత పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. ఫలితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అధ్వాన పరిస్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు.

2014 అసెంబ్లీ ఎన్నికల హామీ ... ఇప్పటివరకు నెరవేర్చని కేసీఆర్

2014 అసెంబ్లీ ఎన్నికల హామీ ... ఇప్పటివరకు నెరవేర్చని కేసీఆర్


ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో లోనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పారని, రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆనాడు కెసిఆర్ హామీ ఇచ్చి ఇప్పటివరకు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు విజయశాంతి. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిధులను సమకూర్చుకుంటున్న పేరుతో కాలం వెళ్లబుచ్చారు అని, ఆ తర్వాత 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి, 2019 ఏప్రిల్ నాటికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారని కానీ ఇప్పటివరకు ఎక్కడా నిరుపేదలకు ఇళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు లబ్దిదారులకు ఇచ్చిన ఇళ్ళు 13,726 మాత్రమే

ఇప్పటి వరకు లబ్దిదారులకు ఇచ్చిన ఇళ్ళు 13,726 మాత్రమే

కేవలం రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇళ్లు పూర్తిగా నిర్మించి పంపిణీ చేసింది 13,726 మందికి మాత్రమేనని పేర్కొన్న విజయశాంతి మిగతా లబ్ధిదారుల మాటేంటి అంటూ ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ లో నిరుపేదల కోసం లక్ష ఇళ్ళు కడుతున్నాము అని ప్రగల్భాలు పలికి, రాత్రి పూట కూడా పనులు చేయిస్తామని చెప్పి, ఏం చేశారో చెప్పాలని విజయశాంతి నిలదీశారు. లబ్ధిదారులకు స్థలం ఉంటే 5 లక్షలు ఇస్తామని వారే ఇల్లు కట్టుకోవచ్చని ప్రభుత్వం చెప్పి ఏడు సంవత్సరాలు అవుతుందని ఇప్పటివరకు అతీగతి లేదని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇంకా రాష్ట్రంలో 1,88,343 ఇళ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి అంటే ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలపై ఉన్న శ్రద్ధ ఇట్టే అర్థమవుతుందని విజయశాంతి వెల్లడించారు.

పీఎం ఆవాస యోజన అమలు చెయ్యకుండా కేసీఆర్ సర్కార్ మోసం

పీఎం ఆవాస యోజన అమలు చెయ్యకుండా కేసీఆర్ సర్కార్ మోసం

పేదింటి కల అయిన సొంతిళ్ల నిర్మాణానికై ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశ వ్యాప్తంగా లబ్ధిదారులకు సాయం చేస్తుంటే, ఆ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా కెసిఆర్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ నేత విజయశాంతి పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సకాలంలో ఫండ్స్ రిలీజ్ చేయకుండా, హడ్కో నుంచి అప్పులు తీసుకుని ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి, కేంద్రం ఇల్లు లేని వారి కోసం ఇచ్చిన నిధులను కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం మళ్లించి తామే నిర్మిస్తున్నామని టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటుందని విజయశాంతి మండిపడ్డారు.

టీఆర్ఎస్ అధికారంలో లబ్ది జరిగింది కేసీఆర్ కుటుంబానికే .. లెక్కలు చెప్పిన రాములమ్మ

టీఆర్ఎస్ అధికారంలో లబ్ది జరిగింది కేసీఆర్ కుటుంబానికే .. లెక్కలు చెప్పిన రాములమ్మ


తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2.91 లక్షల ఇళ్లకు 19,126 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తే, ఇప్పటిదాకా ప్రభుత్వం 10 వేల కోట్లు ఖర్చు చేసిందని, మిగిలిన పనులు పూర్తి చేయడానికి మరో 9 వేల కోట్లు పైగా అవసరం ఉందని, అయితే ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో 11 వేల కోట్ల కేటాయింపులు చూపించిందని పేర్కొన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇళ్ల నిర్మాణం కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులను కాకుండా బ్యాంకులు, రుణ సంస్థల నుండి అప్పుగా తీసుకుంటున్నట్లుగా అధికారులు చెబుతున్నారని విజయశాంతి పేర్కొన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధి పొందింది కెసిఆర్ ఫ్యామిలీ తప్పా ప్రజలు కాదని విజయశాంతి మరోమారు లెక్కలు చెప్పి మరీ స్పష్టం చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు నేరవేర్చలేరని కేవలం మాటల ముఖ్యమంత్రి కేసీఆర్ అని విజయశాంతి తన ట్వీట్స్ ద్వారా వెల్లడించారు.

English summary
BJP senior leader Vijayashanti has once again attacked Telangana CM KCR. The construction of Pragati Bhavan, like Indrabhavan, was done within a year with public money after the early elections 2018, But not completed double bedroom houses to the poor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X