స్టెథెస్కోప్ పట్టిన వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్: ఐసోలేషన్ సెంటర్లో రోగులకు పరీక్షలు
హైదరాబాద్: కరోనా మహమ్మారి అనేక మంది ప్రాణాలు తీస్తున్న నేపథ్యంలో చలించిన వికారాబాద్ ఎమ్మెల్యే, డాక్టర్ మెతుకు ఆనంద్ స్వయంగా రోగుల ప్రాణాలను కాపాడేందుకు స్స్టెతస్కోప్ పట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కరోనా ఐసోలేషన్ సెంటర్‌ను సందర్శించి, స్వయంగా రోగులను పరీక్షించారు.
ఆస్పత్రిలోని కరోనా పేషెంట్ల వార్డులన్నీ తిరిగి, స్వయంగా వైద్యులైన మెతుకు ఆనంద్.. ఒక్కో రోగి దగ్గరికి వెళ్లి స్కెతస్కోప్‌తో పరిక్షీంచారు. అంతేగాక, వారి ఆక్సిజన్ లెవెల్స్, పల్స్ రేట్‌ను పరిశీలించారు. ప్రతి ఒక్కరితో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

కరోనా సోకి అక్కడే చికిత్స పొందుతున్న నమస్తే తెలంగాణ నియోజకవర్గ రిపోర్టర్ రవిని కూడా పరీక్షించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న నమస్తే తెలంగాణ జిల్లా రిపోర్టర్ రాజేష్... రవి పరిస్థితిని వివరించారు. చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ల ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఎమ్మెల్యే ఆనంద్ ఆకాంక్షించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి వైద్యులకు సూచించారు.
ఆ తర్వాత కరోనా పేషెంట్ల కుటుంబసభ్యులతో మాట్లాడి, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలనీ, డబుల్ మాస్క్ వాడాలనీ ఎమ్మెల్యే వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఎమ్మెల్యేతోపాటు కౌన్సిలర్ ప్రవళిక, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ రమేష్ కుమార్, కోఆప్షన్ సభ్యులు షకీల్, నాయకులు కృష్ణ, డాక్టర్ రాజశేఖర్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

కరోనా కట్టడికి నిధుల కొరత లేదు: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి నిధుల కొరత లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనాపై పోరుకు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల కరోనా బాధితులకు కూడా చికిత్స అందిస్తున్నామన్నారు. ఆక్సిజన్, కరోనా నియంత్రణ ఔషధాల సరఫరా పెంచాలని కేంద్రాన్ని కోరామని, ఇందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని తెలిపారు.
చైనా నుంచి తెలంగాణ రాష్ట్రానికి 200 ఆక్సిజన్ కాన్సంటేటర్లు కార్గో విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరాయి. వీటిని గ్రీన్‌కో సంస్థ దిగుమతి చేసుకుంది. ఈ ఆక్సిజన్ కాన్సంటేటర్లను గ్రీన్‌కో ప్రతినిధులు అందజేయడంతో వారికి కేటీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications