Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మురళి హత్య: పాతికేళ్లుగా రగులుతూ.., కత్తులు తిప్పుతూ... నృత్యం చేస్తూ ఇలా

ఇరవై ఐదేళ్లుగా రగులుతూ వచ్చిన పగ గురువారం రక్తం పారించింది. టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అనిశెట్టి మురళిని పాతికేళ్ల పగ బలి తీసుకుంది. అత్యంత కిరాతకంగా మురళి హత్యకు గురయ్యాడు.

వరంగల్‌ : ఇరవై ఐదేళ్లుగా రగులుతూ వచ్చిన పగ గురువారం రక్తం పారించింది. టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అనిశెట్టి మురళిని పాతికేళ్ల పగ బలి తీసుకుంది. అత్యంత కిరాతకంగా మురళి హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన తీరు చూస్తే ఆ పగ ఎంత కసిగా ఉందో అర్థమవుతుంది.

వేటకత్తులతో మురళిని విచక్షణరహితంగా నరికి చంపాడు. మెడ దాదాపుగా తెగిపోయింది. చేతులపై పలు చోట్ల లోతైన గాయాలయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బొమ్మతి జనార్థన్‌ అలియాస్‌ జెన్నీ కౌన్సిలర్‌గా వుండేవాడు. హన్మకొండ కుమార్‌పల్లి మార్కెట్‌ ప్రాంతంలో తిరుగులేని నాయకుడు.

అప్పట్లో జెన్నీ అంటే ఆ ప్రాంతంలో హడల్‌. ఇదే ప్రాంతానికి చెందిన అనిశెట్టి మురళి టీడీపీ నాయకుడిగా రాజకీయంగా అప్పుడప్పుడే ఎదుగుతున్న క్రమంలో ఇరువురి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఒకరంటే ఒకరికి పడని స్థాయికి చేరింది.

జెన్నీ హత్య ఇలా...

1992లో ఒక రోజు జెన్నీ తన బైక్‌పై కుమార్‌పల్లి మార్కెట్‌ రోడ్డుపై వెళుతుండగా నలుగురు వ్యక్తులు కత్తులతో దాడిచేసి పొడిచి చంపారు. అప్పట్లో ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ సంఘటనతో మురళి, మార్కెట్‌ చిన్నతో పాటు మరో ఇద్దరు నిందితుగా కేసు నమోదైంది. వీరు కొద్ది రోజు జైలుకు వెళ్ళారు. ఈ హ్యత కేసు నేపథ్యంలో మురళితోపాటు మిగతా ముగ్గురిపై అప్పట్లో పోలీసు రౌడీషీట్‌ తెరిచారు.

అప్పట్లో రాజీ కుదిరింది...

ఆ తర్వాత కాలంలో జెన్నీ కుటుంబ సభ్యులకు మురళికి మధ్య రాజీ కుదరడంతో కేసు నుంచి మురళి బయటపడినట్లు సమాచారం. మురళి టీడీపీలో రాజకీయంగా క్రమంగా ఎదుగుతూ వచ్చాడు. ఆ పార్టీలో డివిజన్‌ అధ్యక్షుడిగా, జిల్లా పార్టీ కార్యదర్శిగా, అర్బన్‌ పార్టీ ఉపాధ్యక్షుడిగా, అర్బన్‌ అధ్యక్షుడిగా వివిధ పదవులు నిర్వహించారు. టీడీపీలోని ఒక అగ్రనేత సహాయంతో తనపై ఉన్న రౌడీషీట్‌ను ఎత్తివేయించుకున్నాడు. ఆ తర్వాత టీడీపీ పక్షాన పోటీ చేసి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. 2016లో వరంగల్‌ మహానగర పాక సంస్థ ఎన్నికకు ముందు టీడీపీలో తలెత్తిన అంతర్గత విభేదాతో టీఆర్‌ఎస్‌లో చేరారు. 44వ డివిజన్‌ నుంచి పోటీ చేసి మూడవ సారి కార్పొరేటర్‌గా గెలుపొందారు.

Recommended Video

    KCR Government Cheats sheep farmers
    నివురుగప్పిన నిప్పులా....

    నివురుగప్పిన నిప్పులా....

    జెన్నీ హత్యతో పుట్టిన పగ నివురుగప్పిన నిప్పులా ఆయన చిన్న కుమారుడు బొమ్మతి విక్రం రూపంలో రగులుతూనే వచ్చింది. జెన్నీకి ఇద్దరు కుమారులు. గురువారం మురళి హత్య సంఘటనలో పాల్గొన్న విక్రం చిన్నవాడు. జెన్నీ హత్య జరిగినప్పుడు విక్రం చిన్నపిల్లవాడు. తండ్రి హత్యతో రగిలిన పగ ఆయనతో పెరుగుతూ వచ్చింది.

     బెంగుళూరులో బిటెక్ చదివాడు...

    బెంగుళూరులో బిటెక్ చదివాడు...

    బెంగుళూరులో బీటెక్‌ చదివిన విక్రం వరంగల్‌కు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి మురళి హత్యకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం మురళికి తెలియడంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకున్నాయి. 2007లో తనను హత్య చేయడానికి విక్రం కత్తు సిద్ధం చేసుకుంటున్నాడని మురళి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసు విక్రంను విచారించి వదిలేసినట్టు తొస్తోంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య వైరం మరింత పెరిగింది.

    విక్రం పోటీ చేసి ఓడాడు...

    విక్రం పోటీ చేసి ఓడాడు...

    2016లో జరిగిన వరంగల్‌ నగర పాలక సంస్థ ఎన్నికల్లో మురళి టీఆర్‌ఎస్‌ పక్షాన 44వ డివిజన్‌లో పోటీచేయగా, విక్రం 47వ డివిజన్‌ నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయాడు. కార్పొరేషన్‌ ఎన్నికల తర్వాత ఇరువురి మధ్య వైరం మరింత పెరగింది. విక్రం నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని గ్రహించిన మురళి రివ్వార్‌ లైసెన్సు కోసం దరఖాస్తు కూడా చేసుకున్నాడు. అయితే ఆయనకు లైసెన్స్‌ మంజూరు కాలేదు. హంతకులు మురళి హత్యకు చాలా పకడ్బందీగా ప్రణాళిక రచించినట్లు సంఘటన జరిగిన తీరును చూస్తే తొస్తోంది. హత్య అనంతరం విక్రంతో పాటు మిగతా ఇద్దరు రక్తం ఓడుతున్న కత్తులు తిప్పుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు, ఈలు వేసుకుంటూ, నృత్యం చేస్తూ లొంగిపోవడం చూస్తుంటే మురళిపై వారు ఎంత పగతో రగిలిపోయారో అర్థమవుతుంది.

    ఇంటిలోనే ఇలా..

    ఇంటిలోనే ఇలా..

    హన్మకొండ కుమార్‌పల్లిలోని టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అనిశెట్టి మురళి మనోహర్‌ (48) తన ఇంట్లోని పై అంతస్థులోని తన గదిలో గురువారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఓ పంచాయతీ పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నారు. అంతలో ముగ్గురు యువకులు పైకి వచ్చి మనోహర్‌పై వెనుక నుంచి వేట కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా నరికారు. పంచాయితీలో కూర్చున్నవారు ఊహించని ఈ పరిణామానికి భయపడి కిందకు పరుగెత్తుకుంటూ వెళ్లారు. మురళిపై ఎవరో దాడి చేస్తున్నారంటూ ఆయన భార్యకు చెప్పారు.

    చూసేసరికి రక్తం మడుగులో...

    చూసేసరికి రక్తం మడుగులో...

    భార్య పైకి వెళ్ళి చూసే సరికి మురళి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. కొన ఊపిరితో కొట్టుకుంటున్న మురళిని కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. శుక్రవారం పుట్టినరోజనగా మురళి హత్యకు గురవడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+