వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు: 500 రోజుల ఆందోళనపై వైరలైన పాట

మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా మెదక్ జిల్లాలోని 14 గ్రామాల ప్రజలు కొనసాగిస్తున్న ఆందోళన కొనసాగింది. ఈ ఆందోళనలు ప్రారంభమై 515 రోజలు అవుతోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Viral Song Celebrates Telangana Irrigation Project Agitation

మెదక్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా మెదక్ జిల్లాలోని 14 గ్రామాల ప్రజలు కొనసాగిస్తున్న ఆందోళన కొనసాగింది. ఈ ఆందోళనలు ప్రారంభమై 515 రోజలు అవుతోంది. అయితే ఈ ఆందోళనలు 500 రోజులు పూర్తైన సందర్భంగా విడుదల చేసిన పాట వైరల్‌గా మారింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

మల్లన్న సాగర్‌పై గ్రామస్థులు జరిపిన పోరాటం, ఇబ్బందులతో పాటు సుదీర్ఘకాలం పోరాటం నిర్వహించే అవసరమైన మానసిక స్థితిలో లేరు అంటూ పోరాట స్ఫూర్తిని తిరిగి కల్పించడానికి బక్కి శ్రీనివాస్ అనే గాయకుడు ఈ పాటను వ్రాసి పాడాడు .

Viral song celebrates Telangana irrigation project agitation

ఐతే "నేను కేసీఆర్ కి వ్యతిరేకంగా లేను, కానీ మేము ఖచ్చితంగా ద్రోహాన్ని అనుభూతి చెందుతున్నాం అని " అతను జతచేసాడు. 14 గ్రామాలకు చెందిన గ్రామస్థులు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నట్టు ఆపాటలో ప్రస్తావించారు. ఇప్పటికి 515 రోజుల నుండి ఆకలి సమ్మెలో ఉన్నారు అని అతను తన పాటలో ఆవేదన వ్యక్తం చేసాడు.

ఐతే ఎర్రబల్లి గ్రామస్తులు పోరాడటానికి ఓపిక కోల్పోతున్నారని, అయితే వేములఘాట్ గ్రామస్తులు మాత్రం ఇప్పటికీ పోరాడాలని నిశ్చయించుకున్నారు అని శ్రీనివాస్ తన పాటలో ప్రస్తావించారు.

ప్రభుత్వం మా జీవితాలను ఎలా అనిశ్చితంగా చేసేందుకు పూనుకొందో దానిపై నేను పాట రాసానని శ్రీనివాస్ చెప్పారు.కాగా 2016 లో రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు ఉపశమనం కల్పించే లక్ష్యంతో మల్లన్న సాగర్ ప్రాజెక్టును కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టును నిర్మిస్తే ఈ 14 గ్రామాలు ముంపుకు గురౌతాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఐతే ప్రభుత్వం వారికి భూమికి బదులుగా పునరావాసం మరియు ఉపశమన చర్యలకు హామీ ఇచ్చింది. ఐతే గ్రామస్తులు గ్రామాన్ని వదిలి వెళ్ళడానికి నిరాకరించారు. ఈ విషయం ప్రస్తుతం కోర్టులో ఉంది. శాంతియుతంగా ఉద్యమిస్తున్న రైతులతో ప్రభుత్వం కనీసం చర్చలు జరిపే ప్రయత్నం కూడా చేయకుండా, భయపెట్టో, బలం ఉపయోగించో వారిని అణచివేసి, బలవంతంగా వారి భూములను స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతుందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు.

ఈ ప్రాజెక్టు వల్ల ముంపుకు గురికానున్న 14 గ్రామాల ప్రజలు గత కొన్ని నెలలుగా తమ భవిష్యత్‌ పట్ల అగమ్యగోచర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మల్లన్న సాగర్‌ కోసం ముంపుకు గురిచేయాలని అనుకొంటున్న గ్రామాలలో ఇప్పటికే ఉన్న రెండు చెరువులు, పలు కుంటలతో వర్షాలు లేక పోయినా పుష్కలంగా నీరు లభిస్తున్నది. సారవంత మైన ఈ భూములు విత్తనాల అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని స్థానిక రైతులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Villagers have been protesting against the Mallana Sagar irrigation project for 515 days now, and their spirits are dampened because the protest has been dragging.A viral song, released on the 500th day of the protest, describes the struggle that the villagers have gone through so far, and calls the government ‘exploitative.’“People have just become accustomed to pain, and are in no mood to fight the government. To rekindle the spirit of fighting, I wrote and sang this song,” says Bakki Srinivas, the lyricist and singer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X