నకిలీ వీసాతో మోసాలు, ఖమ్మంలో ప్రియురాలు-భర్తను కట్టేసి కొట్టింది!

హైదరాబాద్/ఖమ్మం: విదేశాల్లో ఉద్యోగాలంటూ ఎరవేసి మోసం చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారు నకిలీ వీసాలతో మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పశ్చిమ గోదావరి జిల్లా, సజ్జాపురం (తణుకు) గ్రామానికి చెందిన గంగాధర్ (34), ఇదే జిల్లా చెరుకువాడ (పెనుగొండ)కు చెందిన మురళి వెంకట కృష్ణ ప్రసాద్(34), ఆదిలాబాద్‌ జిల్లా, పోన్‌కల్ (మామిడ)కు చెందిన భూమారెడ్డి(45) ముఠాగా ఏర్పడ్డారు.

ఎల్బీనగర్‌లోని అలకాపురిలో గంగాధర్‌, భూమారెడ్డి ఉంటున్నారు. కృష్ణప్రసాద్‌ బల్కంపేట్‌లో ఉంటున్నాడు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఈ ముఠా ఏజెంట్లను పెట్టుకుంది. నిరుద్యోగులను తీసుకొచ్చిన ఏజెంట్లకు కమీషన్లు చెల్లిస్తూ మోసం చేస్తోంది.

Visa racket busted, 3 arrested

ఉద్యోగం కోసం అంటూ వచ్చిన వారికి పాస్‌పోర్టులను ఇప్పిస్తుంది. అప్పటి నుంచి మాయమాటలు చెబుతూ బుట్టలో వేసుకుంటుంది. గల్ఫ్‌ దేశాల్లో ఏ చిన్న ఉద్యోగం చేసినా రూ.లక్షల్లో జీతాలు వస్తాయంటూ నమ్మిస్తుంది. నకిలీ కంపెనీల పేర్లను ముఠానే సృష్టిస్తుంది. ఆయా కంపెనీలు నెలకు ఇచ్చే జీతాలను రూ.లక్షల్లో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లల్లో చూపుతున్నారు. పోలీసులు పక్కా సమాచారంతో వారిని అరెస్ట్ చేశారు.

ప్రియురాలు సహా భర్తను స్తంభానికి కట్టేసి కొట్టిన మహిళ

తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకొని వేదించడంతోపాటు మానసిక క్షోభకు గురి చేస్తున్నాడని శ్యామల అనే మహిళ ఫిర్యాదు మేరకు భర్త కాశీ పైన పోలీసులుశ నివారం కేసు నమోదు చేశారు. కాశీతోపాటు స్వాతి, సత్యవతిలపై కేసు నమోదు చేశారు.

అంతకుముందు, తనను వదిలేసి మరో యువతితో సంబంధం కొనసాగిస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న శ్యామల.. భర్తను, అతని ప్రియురాలినీ స్తంభానికి కట్టేసి మరీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది.

ఖమ్మం జిల్లా చర్ల నివాసి కాశీకి ఆరేళ్ల క్రితం శ్యామలతో వివాహమైంది. ఓ బిడ్డ పుట్టిన తర్వాత ఆమెను వదిలేసిన కాశీ మరో యువతిని చేరదీసి... హోటల్ నడుపుతున్నాడు. విషయం తెలుసుకున్న శ్యామల తన ఊరి నుంచి వచ్చి భర్తను, ప్రియురాలినీ, అదే హోటల్ ముందున్న స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+