కేసీఆర్‌ను కలిసిన పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువనేత, జూబ్లీహిల్స్ మాజీ శాసన సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.
తన తండ్రి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాలని కేసీఆర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. ఐమాక్స్ ఎదురుగా ఉన్న పార్కుకు పీజేఆర్ పేరు పెట్టాలని కోరినట్లు తెలిపారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. డిసెంబర్ 28న తేదీన పీజేఆర్ ఏడో వర్ధంతి ఉంది.

ఐమాక్స్‌కు ఎదురుగా ఉన్న పార్కుకు పీజేఆర్ పేరు పెట్టాలని గతంలో ఎన్నోసార్లు గత ముఖ్యమంత్రుల వద్ద ప్రస్తావించినా ఎవరు స్పందించలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీ ఆర్ మాత్రం తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారని సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, ఇటీవల కాంగ్రెస్ యువనేత, ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయమై విష్ణు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేయగా, ఆయన కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో విష్ణు తెరాసలోకి వెళ్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications