రేవంత్‌ను కల్సిన కాంగ్రెస్ నేత విష్ణు, ఆ డబ్బు ఎవరో పెట్టి వెళ్లారు!

హైదరాబాద్: చర్లపల్లి జైలులో రిమాండులో ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బుధవారం ఉదయం కలిశారు. ఆయన పరామర్శించేందుకు కలిసినట్లుగా తెలుస్తోంది.

ఆ డబ్బును ఎవరో గదిలో పెట్టి వెళ్లారు!

రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో స్టీపెన్ సన్ నివాసంలో... సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న రూ.50 లక్షలు స్టీఫెన్‌కు అడ్వాన్సుగా ఇచ్చేందుకే తెచ్చారన్నది ఏసీబీ అధికారుల ఆరోపణ. ఈ డబ్బును ఎక్కడినుంచి తెచ్చారని విచారణ సందర్భంగా ప్రశ్నించగా ఆ డబ్బుతో తమకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి చెప్పారు.

Vishnu meets Revanth Reddy

సెబాస్టియన్‌ మాత్రం ఎవరో గదిలో పెట్టి వెళ్లారని, అంతకుమించి తనకేమీ తెలియదని సమాధానం చెప్పారు. ఈ నోట్ల కట్టలపై బ్యాంకు ముద్రలేవీ లేవు. కొన్ని బ్యాంకుల్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేసినా ఎలాంటి ఆధారాలూ లభించలేదని, కాదు లభించాయని వార్తలు వస్తున్నాయి.

ఈ డబ్బును ఎక్కడి నుంచి తెచ్చారో గుర్తించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరో రూ.4.5 కోట్లు ఇస్తామన్న ప్రస్తావన కూడా ఉండటంతో, ఆ డబ్బు ఎక్కడి నుంచి తేవాలనుకున్నారన్న విషయంపైనా దృష్టి సారించారు. దీన్ని నిగ్గు తేల్చేందుకు కొన్ని ప్రైవేటు బ్యాంకులు, కార్పొరేట్‌ సంస్థల లావాదేవీలను ఏసీబీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

తాము కొందరి ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని ఏసీబీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. చంద్రబాబు నాయుడు, మరికొందరి ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. తమది సమర్థవంతమైన విభాగమని, నిబంధనల ప్రకారమే దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+