వాంటెడ్ బీఎల్ సంతోష్.. కవిత ఈడీ విచారణ వేళ సంతోష్ పై పోస్టర్ల కలకలం!!
బీఎల్ సంతోష్ కనిపించటం లేదని కవిత ఈడీ ఇన్వెస్టిగేషన్ టైమ్ లో పోస్టర్లు హైదరాబాద్‌లో కలకలం రేపాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో ఈడీ విచారణకు హాజరవుతున్న వేళ, సిట్ విచారణ తప్పించుకుని తిరుగుతున్న నేత బిఎల్ సంతోష్ ను టార్గెట్ చేస్తున్నారు కొందరు. హైదరాబాద్ నగరంలో బిజెపి ముఖ్య నాయకుడు బి ఎల్ సంతోష్ కనిపించడం లేదని వివిధ ప్రాంతాలలో పోస్టర్లు వేసి ఆయనను టార్గెట్ చేస్తున్నారు.

బీఎల్ సంతోష్ పై పోస్టర్లు
ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు బి ఎల్ సంతోష్ అంటూ ఆయన ఫోటోతో పోస్టర్లు వేసి బహుమానం మోడీ హామీ ఇచ్చిన 15 లక్షల రూపాయలు అంటూ సంతోష్ ను టార్గెట్ చేస్తున్నారు. బి ఎల్ సంతోష్ ను పట్టించిన వారికి మోడీ హామీ ఇచ్చిన 15 లక్షల రూపాయలు బహుమానం ఇస్తామని పోస్టర్లలో రాసుకొచ్చారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన సూత్రధారి అయిన బిఎల్ సంతోష్ కేంద్ర దర్యాప్తు సంస్థల అండదండలతో ఈ కేసు నుంచి తప్పించుకున్నారని, సిట్ విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆయనను టార్గెట్ చేస్తున్నారు.

బిఎల్ సంతోష్ పై తెలంగాణలో చర్చ
మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంలో కర్ణాటక నేత, బిజెపి సీనియర్ నాయకుడైన బి ఎల్ సంతోష్ ప్రధానంగా వ్యవహరించినట్టు బీఆర్ఎస్ నేతలు కీలక ఆరోపణలు చేశారు. ఇక ఈ క్రమంలో బి ఎల్ సంతోష్ ను అరెస్ట్ చేస్తారని అందరూ భావించారు. అయితే ఈ కేసును సిపిఐ కి అప్పగించడంతో, బిఎల్ సంతోష్ కేంద్ర దర్యాప్తు సంస్థల అండతో సీట్ విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని బీఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా వెలిసిన పోస్టర్లు బి ఎల్ సంతోష్ పై తెలంగాణలో చర్చకు కారణంగా మారాయి.

ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవిత.. కానీ బీఎల్ సంతోష్?
ఇక నేడు ఎమ్మెల్సీ కవిత ఈ డి విచారణకు హాజరవుతున్న వేళ, ఈ పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నోటీసులు ఇస్తే ఈ డి విచారణకు కవిత హాజరవుతూ తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కానీ బిజెపి నేతలు దొంగ దారిన విచారణకు రాకుండా తప్పించుకుంటున్నారు అని, అందుకు బీఎల్ సంతోష్ తీరే ఉదాహరణ అన్న చర్చ బీఆర్ఎస్ పార్టీ నేతలలో ప్రధానంగా జరుగుతుంది.

బీఎల్ సంతోష్ పై పోస్టర్లు బీఆర్ఎస్ పనే
అయితే ఈ పోస్టర్లపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. కావాలని బి ఆర్ ఎస్ నాయకులే ఈ పోస్టర్లు వేశారని, వెంటనే వాటిని తొలగించాలని చెబుతున్నారు. కేవలం కవితను ఈడీ విచారణ చేస్తుంటే, దాని నుండి దృష్టి మరల్చడం కోసమే ఈ విధంగా బి ఎల్ సంతోష్ పై పోస్టర్లు వేశారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications