మాధురి కన్నుమూత: వరంగల్ 'యాసిడ్' ఘటనలో ట్విస్ట్.. దాడి వెనుక కారణాలివే?
వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామ సమీపంలోని దుబ్బగుట్ట వద్ద యాసిడ్ దాడికి గురైన మాధురి అనే వివాహిత ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.
యాసిడ్ గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పరిస్థితి విషమించి గురువారం కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

నిందితులు వీరే?:
యాసిడ్ దాడి నిందితులను మిల్స్‌కాలనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిల్స్‌కాలనీ పీఎస్ పరిధిలోని సాకరాసికుంటకు చెందిన ఆటోడ్రైవర్ చందు, అదే ప్రాంతానికి చెందిన అతడి స్నేహితుడు రాకేష్‌లతో పాటు ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన మరో స్నేహితుడు అనిల్‌లను పోలీసులు విచారిస్తున్నారు.

ఆటోలో తీసుకెళ్లారు:
పెట్రోల్ బంకులో పని కోల్పోవడంతో పని వెతుక్కుంటానని తల్లితో చెప్పి బుధవారం మాధురి ఇంటినుంచి బయటకెళ్లిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నాం ఒంటిగంట సమయంలో ఎంజీఎం ఆసుపత్రి సమీపంలో మాధురిని ఆటో డ్రైవర చందు బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఎవరిచ్చారు?:
ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి దుబ్బకుంట ప్రాంతానికి తీసుకెళ్లి.. అక్కడ ఆమెను చున్నీతో కట్టేసి, ముఖం యాసిడ్(తేజాబ్)తో దాడి చేశాడు. ఆపై ఆమెను అక్కడే వదిలేసి అక్కడినుంచి పరారయ్యాడు.
మాధురిని హతమార్చేందుకు వాడిన తేజాబ్‌ను చందుకు స్నేహితులే అందిచారన్న జరుగుతోంది. అది ఎక్కడి నుంచి వచ్చింది?, ఎప్పుడు సేకరించాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీ ట్విస్ట్:
భర్తతో విడిపోయి దూరంగా ఉంటున్న మాధురికి పెట్రోల్ బంకులో పనిచేస్తున్న సమయంలో ఆటో డ్రైవర్ చందుతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త పెళ్లికి కూడా దారితీసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. వేములవాడలో వీరిద్దరు వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.
పెళ్లి తర్వాత కొంత కాలం ఇద్దరూ కలిసి ఉన్నా.. కొద్ది రోజుల క్రితం మాధురి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. అదే సమయంలో ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా మెదలడం చందుకు మింగుడుపడలేదు. అప్పటికే ఆమెకు పాప ఉన్న విషయం కూడా చందుకు తర్వాత తెలియడం.. ఆ విషయాన్ని తన వద్ద దాచిందన్న కారణంతో అతను కక్ష పెంచుకోవడం జరిగాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications