వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రూపుల గులాబీ: టిఆర్‌ఎస్‌ ముఖ్యనేతల తలోదారి, అధిష్టానం సీరియస్

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: టిఆర్‌ఎస్‌ జిల్లా కార్యవర్గం ఏర్పాటు.. ఆ పార్టీలో ముఖ్యనేతల ఆధిపత్య పోరుకు కారణమవుతోంది. ఇన్నాళ్లు అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లో సఖ్యత లేకపోవడంతో కార్యవర్గం కూర్పు కొలిక్కి రావడం లేదు. టిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్వయయంగా ఆదేశించినా... అర్బన్‌ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు భేటీ కావడం లేదు.

జిల్లా కార్యవర్గంలో ఎవరికి చోటు కల్పించాలనే విషయంపై ప్రతిపాదనలు రూపొందించడం లేదు. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో 30 జిల్లా కార్యవర్గాలు ఇప్పటికే ఖరారయ్యాయి. అధ్యక్షులతోపాటు కార్యవర్గాలను ప్రకటించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు సంబంధించి మాత్రం కార్యవర్గం ఏర్పాటు ఎంతకీ కొలిక్కి రావడం లేదు. కనీసం ప్రతిపాదనలు సైతం సిద్ధం కావడం లేదు. పార్టీ ఆదేశాల విషయంలో తీవ్ర నిర్లిప్తత వహిస్తున్న జిల్లా ప్రజాప్రతినిధుల తీరుపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

దీపావళి పండగకు ముందు రోజే అన్ని జిల్లాలకు పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేసేలా టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రయత్నించింది. జిల్లా అధ్యక్ష పదవి మినహా మిగిలిన మొత్తం కార్యవర్గానికి సంబంధించి ఏకాభిప్రాయంతో ప్రతిపాదనలు పంపాలని అన్ని జిల్లా ముఖ్య నేతలను పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు అక్టోబరు 28న హైదరాబాద్‌లోని కడియం శ్రీహరి నివాసంలో సమావేశమయ్యారు. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అక్కడికి వెళ్లలేదు. దీంతో వరంగల్‌ అర్బన్‌ జిల్లా సమావేశం వాయిదా పడింది.

Warangal district TRS leaders group politics

సమావేశానికి రాకున్నా... అక్టోబరు 29 సాయంత్రంలోపు లిఖితపూర్వకంగా పంపాలని ప్రజాప్రతినిధులను పార్టీ అధిష్టానం ఆదేశించింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ప్రజాప్రతినిధులు ఎవరూ ఈ విషయం పట్టించుకోలేదు. జిల్లా కార్యవర్గంపై ప్రతిపాదనలు రూపొందించలేదు. దీంతో పార్టీ అధిష్టానం మరోసారి జోక్యం చేసుకుంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి సూచిందింది. అధికారిక పనుల్లో బిజీగా ఉన్నందున సమావేశం నిర్వహించలేనని కడియం శ్రీహరి చెప్పినట్లు తెలిసింది. దీంతో ప్రజాప్రతినిధుల భేటీ బాధ్యతలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావులకు పార్టీ అప్పగించింది.

ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌లు విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలిసింది. మిగిలిన ఎమ్మెల్యేలు, మేయర్‌, ఇతర ముఖ్యనేతలు కూడా అందుబాటులో లేకపోవడంతో గురువారం సైతం ఈ సమావేశం జరగలేదు. దీంతో అధిష్టానానికి ఎలాంటి ప్రతిపాదనలూ పంపలేదు.

24 మందితో...

పది లక్షల జనాభా ఉన్న జిల్లాలకు 24 మందితో కార్యవర్గం ఏర్పాటు చేయాలని టిఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయించింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు సైతం ఇదే తరహాలో కమిటి ఉండనుంది. అధ్యకక్షుడు, ఉపాధ్యకక్షుడు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, ఐదుగురు కార్యదర్శులు, ఐదుగురు సహాయ కార్యదర్శులు, ఏడుగురు కార్యవర్గ సభ్యులు కమిటీల్లో ఉండనున్నారు. జిల్లా కమిటికి అనుబంధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిీ, మహిళా, యువజన, రైతు, కార్మిక, విద్యార్థి కమిటీలు ఉంటాయి.

ప్రతి అనుబంధ కమిీలో అధ్యకక్షుడు, ఉపాధ్యకక్షుడు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు కార్యదర్శులు, నలుగురు కార్యవర్గ సభ్యులు ఉంటారు. తొమ్మిది అనుబంధ సంఘాలకు కలిపి 90 మందికి కమిటిల్లో చోటు దక్కనుంది. జిల్లా కార్యవర్గంలో మొత్తం 114 మందికి ప్రాతినిధ్యం ఉంటుంది.

English summary
TRS High command serious on Warangal district TRS leaders group politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X