క్యాంపస్ నియామకాల్లో వరంగల్ ఎన్ఐటీ రికార్డ్: 1326 మంది ఎంపిక, లక్షల్లో జీతాలు

వరంగల్: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ) వరంగల్ విద్యార్థులు ఉద్యోగాల సాధనలో సత్తా చాటారు. 2022-23 సంవత్సరం ప్రాంగణ నియామకాల ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సాధించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సాధించడం గమనార్హం.

క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్లిన 253 కంపెనీల్లో మొత్తం 1326 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఇందులో 40 శాతానికిపైగా కొత్త కంపెనీలే ఉన్నాయి. ఢిల్లీకి చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆదిత్య సింగ్ అత్యధికంగా రూ. 88 లక్షల వార్షిక వేతనంతో ఎంపికయ్యారు.

Warangal NIT campus recruitment record: 1326 students get jobs

ఒక్కో విద్యార్థికి సగటున రూ. 17.29 లక్షల వార్షిక ప్యాకేజీ దక్కింది. 30 మంది విద్యార్థులు రూ. 50 లక్షలకుపైగా వార్షిక వేతనాన్ని పొందనున్నారు. 55 మందికి రూ. 40 లక్షలకుపైగా, 190 మందికి రూ. 30 లక్షలకుపైగా వార్షిక వేతనంగా అందుకోనున్నారు. 408 మంది విద్యార్థులకు రూ. 20 లక్షలకుపైగా లభించింది.

ప్రభుత్వ రంగ సంస్థల్లో 50 మందికిపైగా ఎంపికయ్యారు. 2021-22 విద్యా సంవత్సరంలో 1132 మంది విద్యార్థులు క్యాంపస్ నియామకాల్లో ఎంపికయ్యారు. ఈ ఏడాది ఇంతకుమించి ఉద్యోగాలు సాధించి విద్యార్థులు సత్తా చాటారు. ఎన్ఐటీలో విద్యా ప్రమాణాలు, పరిశోధనల నాణ్యత పెరగడం వల్లే ఈసారి అత్యధిక మందికి ఉద్యోగాలు దక్కాయని వరంగల్ నిట్(Warangal NIT) సంచాలకుడు ప్రొఫెషర్ ఎన్వీ రమణారావు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+