హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై నీటిపైనే క్రికెట్, ఫుట్‌బాల్ ఆడొచ్చు..!

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ఇప్పటికే విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో మరిన్ని కొత్త హంగులు రాబోతున్నాయి. ఇప్పటికే నగరంలోని కొత్వాల్ గూడలో రూ. 225 కోట్ల వ్యయంతో ఆర్టిఫీషియల్ బీచ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును దాదాపు 35 ఎకరాల విస్తీర్ణంలో డిసెంబర్ నెల నుంచి మొదలు పెట్టనున్నారు. దీంతో భాగ్యనగర వాసులకు బీచ్ లేని కష్టాలు తీరనున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌ లోని హుస్సేన్‌సాగర్‌ గురించి మనకు తెలిసిందే. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వీకెండ్స్ లో అలా ఫ్యామిలీస్ తో ఈ ఏరియాలో కొద్దిసేపు సేద తీరుతారు నగర వాసులు. అయితే హుస్సేన్‌సాగర్‌ లో త్వరలో ఫ్లోటింగ్‌ గ్రౌండ్స్‌ (తేలియాడే మైదానాలు) ప్రత్యక్షం కానున్నాయి. సింగపూర్‌ వంటి దేశాల్లో మాత్రమే ఇలాంటివి మనకు కనిపిస్తుంటాయి. ఈ ప్రాజెక్టు అమలు అయితే పర్యాటకుల సంఖ్య మరింత పెరగనుంది.

ఇక నగర వాసులకు అయితే ప్రత్యేక అనుభవమనే చెప్పాలి. నీటిపై తేలియాడే మైదానంలో ఫుట్‌బాల్, బాక్స్ క్రికెట్‌ వంటి క్రీడలు ఎంచక్కా ఆడుకోవచ్చు. ఈ మేరకు సింగపూర్ తరహాలో హుస్సేన్ సాగర్ లో ఫ్లోటింగ్ బాక్స్ క్రికెట్ గ్రౌండ్‌ ను, ఫుడ్ బాల్ గ్రౌండ్ ను ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

Waves of Victory The First Box Cricket Clash on Hussain Sagar s Floating Ground

హుస్సేన్‌ సాగర్‌ ను మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు తగిన విధి విధానాలను హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తోంది. అలాగే ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్ ను కలుపుతూ నెక్లెస్‌ రోడ్డు, సంజీవయ్య పార్కు, ట్యాంక్‌ బండ్, ఎన్టీఆర్‌ గార్డెన్, ప్రసాద్‌ ఐమాక్స్‌ వరకు దాదాపు 10.5 కిలోమీటర్ల పొడవుతో స్కైవాక్‌ వంతెన నిర్మాణంపై ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+