బిజెపి కార్పొరేటర్ల అరెస్టును ఖండిస్తున్నా.!ఇదేనా జీహెచ్ఎంసీ విధానం.?మండిపడ్డ బండి సంజయ్

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి ఏడాదైనా ఇంతవరకు జనరల్ బాడీ మీటింగ్ పెట్టని టీఆర్ఎస్ వైఖరికి నిరసనగా ధర్నా చేసిన బిజెపి కార్పొరేటర్లను అరెస్టు చేయడాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తోందని తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. అరెస్టు చేసిన కార్పొరేటర్లను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేసారు. ప్రజా ప్రతినిధులన్న కనీస స్పృహ లేకుండా బిజెపి కార్పొరేటర్ల పట్ల దురుసుగా వ్యవహరించిన పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపడుతున్నామన్నారు బండి సంజయ్. టీఆర్ఎస్ పాలనలో ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల సంగతేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని, జీహెచ్ఎంసీ పాలక వర్గం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తవుతున్నా ఇంతవరకు స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు బండి సంజయ్.

 We condemn the arrest of BJP corporators.!Bandi Sanjay fired on GHMC

గత నిబంధనలను విరుద్దంగా వ్యవమరించడమే కాకుండా ఏకపక్షంగా తమ అనుకూల సభ్యులతో స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ ను ఏర్పాటు చేయడం టీఆర్ఎస్ నియంతృత్వానికి నిదర్శనమన్నారు బండి సంజయ్. బిజెపి కార్పొరేటర్లకు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం కల్పించకపోవడం అప్రజాస్వామికమని, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను అవమానించడమేనని అన్నారు. 74వ రాజ్యాంగ సవరణను ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, కరోనా సాకు చూపి నామమాత్రంగా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ పాలనను పూర్తిగా గాలికొదిలేశారని మండి పడ్డారు. కార్పొరేటర్లకు జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ అందుబాటులో ఉండడం లేదని, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పాత బిల్లులే చెల్లించకపోవడంతో కొత్త పనులు ఎలా చేయించగలరని, టీఆర్ఎస్, మున్సిపల్ మంత్రి చెప్పినట్టే జీహెచ్ఎంసీ పనిచేస్తే క్రమంలో కార్పొరేటర్ల వ్యవస్థతో పాటు జీహెచ్ఎంసీ పాలక వర్గం ఎందుకున్నట్టని బండి సంజయ్ ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+