హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెయ్యిమందికి నోటీసులు, ఆ పేర్లు బయటపెట్టొద్దని ఒత్తిడి: అకున్ సభర్వాల్

డ్రగ్స్ కేసు విచారణలో బయటపడుతున్న మరికొందరు సినీ పెద్దలు, నటుల పేర్లను వెల్లడించొద్దనే ఒత్తిడి, బెదిరింపులు వస్తున్నాయని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్‌ సభర్వాల్ చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ కేసు విచారణలో బయటపడుతున్న మరికొందరు సినీ పెద్దలు, నటుల పేర్లను వెల్లడించొద్దనే ఒత్తిడి, బెదిరింపులు వస్తున్నాయని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్‌ సభర్వాల్ చెప్పారు.

డ్రగ్‌కేసు: భోజనం చేయని రవితేజ, కెల్విన్, జీషాన్ సంబంధాలపై ప్రశ్నలుడ్రగ్‌కేసు: భోజనం చేయని రవితేజ, కెల్విన్, జీషాన్ సంబంధాలపై ప్రశ్నలు

శనివారం లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని రామకృష్ణమఠంలోని స్వామి వివేకానంద హ్యూమన్ ఎక్సెలెన్సీ ఆధ్వర్వంలో నిర్వహించిన శ్రద్ధ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జంట నగరాల నుండి వచ్చిన పలువురు యువతీ యువకులకు పలు అంశాలపై ఆయన అవగాహన కల్పించారు.

సిగరెట్, మద్యం అమ్మకాలను నియంత్రించగలం కానీ, దుకాణాలను మాసివేసే అధికారం తనకు లేదని ఆయన చెప్పారు. డ్రగ్స్ కేసులో తాను మాత్రం పారదర్శకంగానే వ్యవహరిస్తున్నట్టు చెప్పారు.

పకడ్బందీ వ్యూహంతోనే రవితేజ: న్యాయవాదుల సలహలు, ఆ కారే ఎందుకంటే?పకడ్బందీ వ్యూహంతోనే రవితేజ: న్యాయవాదుల సలహలు, ఆ కారే ఎందుకంటే?

డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో సినీ ప్రముఖుల విచారణ కొనసాగుతోంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో డ్రగ్స్‌తో లింకులున్నాయనే విషయమై ఖచ్చితమైన ఆధారాలను సేకరించేందుకుగాను ఎక్సైజ్ అధికారులు విచారణ సాగిస్తున్నారు.

ఎవరా ఇద్దరు?: సిట్‌కు ముమైత్, పూరీతో చెడిందా?ఎవరా ఇద్దరు?: సిట్‌కు ముమైత్, పూరీతో చెడిందా?

సినీ, ప్రముఖుల పేర్లను చెప్పొద్దని ఒత్తిడి

సినీ, ప్రముఖుల పేర్లను చెప్పొద్దని ఒత్తిడి

డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న సినీ ప్రముఖుల పేర్లను వెల్లడించకూడదని తనపై ఒత్తిడి ఉందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ బాంబు పేల్చారు. అయితే ఈ కేసులో ఇప్పటికే విచారించిన కొందరు సెలబ్రిటీలు సినీ రంగానికి చెందిన కొందరి పేర్లను వెల్లడించారనే ప్రచారం ఎక్సైజ్ వర్గాల్లో ఉంది. అయితే ఈ విచారణను ఆధారంగా చేసుకొని మరికొందరికి నోటీసులు జారీ చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే సినీ రంగానికి చెందిన ప్రముఖులకు ఈ కేసులతో లింకులున్నాయనే ప్రచారం సాగుతున్నాయి. అయితే ఈ తరుణంలోనే అకున్ సభర్వాల్ చేసిన కామెంట్ సంచలనంగా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖుల పేర్లను చెప్పకూడదని తనపై ఒత్తిడి ఉందని ఆయన ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

 ఒత్తిడి చేస్తోందెవరు?

ఒత్తిడి చేస్తోందెవరు?

ఈ కేసుతో లింకులున్నవారి పేర్లను బయట పెట్టకుండా ఎవరు ఒత్తిడికి గురిచేస్తున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఈ పేర్లను బయటకు రాకుండా అడ్డుకొంటున్నారా.. లేదా ప్రభుత్వంలోని కొందరు అడ్డుకొంటున్నారా...రాజకీయ ప్రముఖులు ఎవరైనా ఈ ఒత్తిడులు తెస్తున్నారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అత్యంత ప్రాధాన్యత గల ఈ కేసులో ఒత్తిడులను ఎదుర్కొంటున్నట్టు అకున్ సభర్వాల్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.అయితే ఎవరు ఒత్తిడికి గురిచేస్తున్నారనే విషయమై ఆయన స్పష్టంగా ప్రకటించలేదు.

వెయ్యి మందికి నోటీసులు

వెయ్యి మందికి నోటీసులు


డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటికీ వెయ్యిమందికి నోటీసులు జారీ చేసినట్టుగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ ప్రకటించారు. కళాశాలలు, స్కూళ్ళతో పాటు, పారిశ్రామికవేత్తల పిల్లలు, డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో వారికి నోటీసులు పంపినట్టు చెప్పారు. డ్రగ్స్ కేసును పారదర్శకంగా విచారణ చేయాలని ఆదేశించారని ఆయన కోరారు.

డ్రగ్స్ వాడితే మూడేళ్ళ జైలు శిక్ష

డ్రగ్స్ వాడితే మూడేళ్ళ జైలు శిక్ష

డ్రగ్స్ వాడితే మూడేళ్ళ జైలు శిక్షను విధించనున్నట్టు అకున్ సభర్వాల్ ప్రకటించారు. మాదకద్రవ్యాలు లేని రాష్ట్ర నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు ఆయన చెప్పారు. వచ్చే ఏడాదిలోపుగా హైద్రాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్రయత్నాలను చేస్తున్నట్టు అకున్ సభర్వాల్ ప్రకటించారు.

 నేను ర్యాగింగ్‌తో ఇబ్బందిపడ్డా

నేను ర్యాగింగ్‌తో ఇబ్బందిపడ్డా

కళాశాలల్లో జరిగే ర్యాగింగ్‌తో తాను కూడ ఇబ్బందిపడ్డానని అకున్ సభర్వాల్ చెప్పారు. తాను చదువుకొనే సమయంలో ర్యాగింగ్‌కు ఎలా గురయ్యాడో ఆయన వివరించారు.ర్యాగింగ్ అనేది సరదాగా, పరిచయం కోసం ఉంటే తప్పులేదన్నారు. కానీ, దీని వల్ల చాలమంది యువతీ యువకులు ఆత్మహత్యలు చేసుకొన్నారని ఆయన గుర్తుచేశారు. హైద్రాబాద్ సెంట్రల్‌జోన్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ర్యాగింగ్ నిరోధం కోసం తాను విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించినట్టు చెప్పారు.

English summary
we issued 1000 notices for drug case said excise enforcement director akun sabharwal. He participated in a meeting held at Ramakrishna Math on Saturday. Somebody presure on me dont revel celebraties names in Tollywood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X