వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రదర్.. ఇది అభ్యంతరకరం.. అందుకే బహుజన రాజ్యం రావాలనేది: కౌశిక్ రెడ్డిపై మాజీ ఐపీఎస్ ప్రవీణ్

|
Google Oneindia TeluguNews

బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా రాజకీయ అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్న మాజీ ఐపీఎస్ అధికారి,స్వేరో చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన వర్గాల తరుపున బలమైన గొంతుక వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. బహుజనులను కేవలం ఓటు బ్యాంకుగా చూసే రాజకీయాలను ఇక సహించేది లేదంటూ ఇటీవలి ఇంటర్వ్యూల్లో ఆయన స్పష్టం చేశారు. తాజాగా టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి బహుజన వర్గాలను తక్కువ చేసేలా వ్యాఖ్యలు చేశారని ట్విట్టర్ వేదికగా ప్రవీణ్ కుమార్ విమర్శించారు.

ప్రవీణ్ కుమార్ ఏమన్నారు...

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరిన సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఓ వీడియో క్లిప్‌ను ప్రవీణ్ కుమార్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అందులో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తులను గారు అంటూ గౌరవప్రదంగా స్టేజీ మీదకు ఆహ్వానించిన కౌశిక్ రెడ్డి... ఇతర వర్గాలను ఏకవచనంతో సంబోధించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.'కౌశిక్ బ్రదర్, మీరు ఆధిపత్యకులాల నాయకులను 'గారు' అని గౌరవించి, పీడిత వర్గాలకు చెందిన వారిని మాత్రం ఏక వచనంతో పిలిచారు. ఇది అభ్యంతరకరం. ఇలాంటి దురహంకార భావజాలం వల్లనే జనాలు బహుజనరాజ్యం రావాలంటున్నరు. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు. కానీ ఇలాంటి వైఖరిని మనం విడనాడాలి.' అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

కౌశిక్ రెడ్డి రియాక్షన్...

మరోవైపు,ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కౌశిక్ రెడ్డి స్పందించారు. ఎవరో ఎడిట్ చేసిన వీడియోను పోస్టు చేసి మీ స్థాయిని తగ్గించుకున్నారని ప్రవీణ్ కుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'గౌరవ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.. మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. మీ హోదాకు తగిన విమర్శలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ నా మిత్రులు బహుజన,దళిత బిడ్డలే.' అని చెప్పుకొచ్చారు.

క్రిశాంక్ కౌంటర్... స్వేరోస్ రియాక్షన్...

క్రిశాంక్ కౌంటర్... స్వేరోస్ రియాక్షన్...

మాజీ ఐపీఎస్ ప్రవీణ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఫేస్‌బుక్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. 'మీ సిద్దాంతాలను ప్రశ్నించినవారిని వదిలి.. మీ మీద ఆరోపణలు చేసినవారిని వదిలి.. మిమ్మల్ని తొలగించాలని ప్రయత్నించినవారిని వదిలి... మీ కేసు పెట్టినవారిని వదిలి... మీ అస్తిత్వాన్ని దెబ్బతీసినవారిని వదిలి... ఏడేళ్లుగా మీతో కలిసి ఉన్నవారిని ప్రశ్నించడం మీ రాజకీయ అవసరమా సార్...?' అని ప్రశ్నించారు. ఈ విమర్శలకు స్వేరోస్ నాయకులు ధీటుగా బదులిచ్చారు. 'ఇది మీకు తగునా బ్రదర్... ఓహో కౌశిక్ రెడ్డి ఏడేళ్లుగా టీఆర్ఎస్‌లో ఉన్నాడా... మనకోసం ప్రశ్నించే నాయకుడిని వదిలి... మన కోసం కష్టించే నాయకుడిని వదిలి... మన కోసం పదవిని త్యాగం చేసిన నాయకుడిని వదిలి... కేసీఆర్,కేటీఆర్‌లను జోకడం మీ రాజకీయ అవసరమా బ్రదర్... కుల దురహంకారంతో జనాలను సంబోధిస్తున్న కౌశిక్ రెడ్డికా మీ మద్దతు... మీ ప్రశ్న కౌశిక్ రెడ్డిపై వేయండి.' అని నిలదీశారు.

బీఎస్పీలోకి ప్రవీణ్ కుమార్...

బీఎస్పీలోకి ప్రవీణ్ కుమార్...


ఈ వివాదం సంగతి పక్కనపెడితే... ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీపై స్పష్టత వచ్చింది. యూపీ మాజీ సీఎం మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ(బహుజన్ సమాజ్ పార్టీ)లో ఆయన చేరనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మాయావతి ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ప్రవీణ్ కుమార్ నుంచి గానీ,స్వేరోస్ నుంచి అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. పదవికి రాజీనామా చేసినరోజే మహనీయులు పూలే,అంబేడ్కర్,కాన్షీరాం బాటలో పయనిస్తానని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. చెప్పినట్లుగానే ఆ సిద్ధాంతాలపై నడిచే బీఎస్పీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

English summary
Ex IPS officer Praveen Kumar posted a video clip of Kaushik Reddy speaking on the occasion of joining the party in the presence of TRS chief KCR, on his Twitter. In it, Kaushik Reddy politely invited people from Reddy's community to the stage and there is difference inviting other community people on to the stage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X