రాజాసింగ్ ను విడుదల చేయకపోతే హైద్రాబాద్ ను ముట్టడిస్తాం.!అఖిల భారత శ్రీరామ్ సేన వార్నింగ్.!
హైదరాబాద్ : రాజాసింగ్ ఎమ్మెల్యే ను కలవడానికి జైల్ కి వెళ్తే అనుమతించలేదని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అఖిల భారత శ్రీరామ్ సేనా జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ మూతాలిక్. రాజాసింగ్ తీవ్రవాది కాదుకదా.?అస్సలు ఎందుకు కలవడానికి అనుమతులు ఇవ్వరని మండిపడ్డారు. కర్ణాటక నుండి రాజాసింగ్ ను కలవడానికి వస్తే, మూలకత్ కు ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే రాజసింగ్ పై అక్రమ పిడియాక్ట్ బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రమోద్ మూతాలిక్ పేర్కొన్నారు. రాజాసింగ్ కు జైల్ లో ఎలాంటి సౌకర్యాలు లేవని, రాజాసింగ్ కు ఏం జరిగినా ప్రభుత్వం, సీఎం చంద్రశేఖర్ రావే బాద్యత వహించాలన్నారు. ఒక హిందు ఎమ్మెల్యే పై ఇలాంటి అక్రమ కేసులు పెట్టి జైల్ కు తరలించడం పై భారత దేశ హిందువులందరిని ఏకం చేస్తామని, రాజాసింగ్ పై పెట్టిన కేసులు ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే, లక్షలాది మందితో హైద్రాబాద్ ను ముట్టడిస్తామని హెచ్చారించారు.

మునవర్ ఫారూఖ్ అలీ హిందువు దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాము ఎలా ఉపేక్షిస్తామన్నారు ప్రమోద్ మూతాలిక్. హిందువు దేవుళ్లను కించపరిచిన మునవర్ ఫారుకీ షోకు ప్రభుత్వం ఎందుకు అనుమతిచ్చిందన్నారు. హైద్రాబాద్ లో ఆందోళనకు కారణం తెలంగాణ ప్రభుత్వమేనని ఆరోపించారు. హైద్రాబాద్ పాకిస్థాన్ లో ఉందా, భారత్ లో ఉందా.? అని ప్రశ్నించడమే కాకుండా హిందువు దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్లపై ఎందుకు కేసులు పెట్టడం లేదని నిలదీసారు. మేము రాజాసింగ్ కు మద్దతుగా నిలుస్తామని, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. పది రోజుల్లో రాజాసింగ్ ను విడుదల చేయకపోతే, దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరితో కలసి10రోజుల్లో హైద్రాబాద్ ను ముట్టడిస్తామని, ఇందులో ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకున్నా తెలంగాణ ప్రభుత్వానిదే బాద్యత అన్నారు ప్రమోద్ మూతాలిక్.












Click it and Unblock the Notifications