స్మితా సబర్వాల్ ‘పోస్ట్’పై చట్ట ప్రకారం ముందుకు!
హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల అంశంపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టే చెప్పిందన్నారు. బుధవారం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మరోవైపు, కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. నకిలీ వీడియోలు, ఫొటోలు అన్ని వ్యవస్థలను ప్రభావం చేస్తున్నాయన్నారు. భూముల విషయం కోర్టుల పరిధిలో ఉన్నందన ఏమీ మాట్లాడలేమన్నారు.

ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై చట్ట ప్రకారం ముందుకెళ్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. నెమళ్లు జనావాసాల్లోకి రావడం సాధారణమని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే కుట్ర పన్నుతున్నట్లు భావిస్తున్నామన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే ఈ భూములపై ప్రధాని మోడీ మాట్లాడారన్నారు. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కూలగొడితే కూలిపోయే ప్రభుత్వం తమది కాదని అన్నారు.
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కంచ గచ్చిబౌలిలోని చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు అంటూ జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వంద ఎకరాలు ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి అంటూ ప్రశ్నించింది. లేదంటే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీలేదని స్పష్టం చేసింది.
వీడియోలు చూసి తాము ఆందోళనకు గురైనట్లు పేర్కొంది. అభివృద్ధి, పర్యావరణానికి మధ్య సమతుల్యం అవసరమని స్పష్టం చేసింది.
ఇష్టం వచ్చినట్లు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటూ ఊరుకోమని హెచ్చరించింది. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే చెరువు దగ్గరే తాత్కాలిక జైలుపెట్టి అధికారులను అక్కడే ఉంచుమతామి తేల్చి చెప్పింది. వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలు వినిపిస్తూ అన్ని పనులు ఆపేశమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకుమంటామని కోర్టుకు తెలిపారు. ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేశారన్నారు. మినహాయింపులకు లోబడే తాము కొన్ని చెట్లు తొలగించామని తెలిపారు. కాగా, సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను 15కు వాయిదా వేసింది.
స్మితా సబర్వాల్‌కు పోలీసుల నోటీసులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువత అభివృద్ధి, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ (Smita Sabharwal)కు పోలీసులు నోటీసులు అందించారు. సోషల్ మీడియాలో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ సహాయంతో రూపొందించిన ఫొటోను షేర్ చేయడం ఇందుకు కారణం కావడం గమనార్హం.
ఈ ఫొటో మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఈ పొటో మష్రూమ్ రాక్ వద్ద బుల్‌డోజర్లు, వాటిని చూస్తున్న నెమలి, జింక లాంటి జంతువులతో జిబ్లి శైలిలో రూపొందించినట్లు ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) పరిధిలో ఉన్న కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని చిత్రంలో చూపించారు. ఆ ఫొటోను స్మితా సబర్వాల్ షేర్ చేశారు.
నోటీసుల విషయంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ.. బీఎన్ఎస్ఎస్‌లోని సెక్షన్ 179 ప్రకారం స్మిత్ సబర్వాల్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అయితే, నోటీసులో పేర్కొన్న విషయాలను ఇప్పుడే బయటపెట్టలేమని స్పష్టం చేశారు.
కాగా, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 ప్రకారం కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి.. సంబంధిత వ్యక్తులను స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ పీఎస్‌కు హాజరయ్యేలా పిలిచే అధికారం కలిగి ఉంటారు. ఆ నిబంధనల ఆధారంగానే స్మితా సబర్వాల్‌కు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రజా చైతన్యాన్ని కలిగించే విభాగంలో ఉన్న ఒక అధికారికి నోటీసు రావడం చర్చనీయాంశంగా మారింది.
గతంలో కూడా స్మితా సబర్వాల్ సోషల్ మీడియా పోస్టులతో చిక్కుల్లో పడ్డారు. కాగా, తాజా అంశంలో మాత్రం ఆమెకు పలువురి నుంచి మద్దతు లభిస్తోంది. ఫొటో షేర్ చేసినందుకు కూడా నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. బావ ప్రకటనా స్వేచ్ఛ అంటే ఇదేనా? అని నిలదీస్తున్నారు. దీంతో తనకు మద్దతుగా నిలిచిన వారి పోస్టులను స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో రీట్వీట్ చేస్తున్నారు.
'మొదటిసారిగా, పోలీసులు రీట్వీట్ చేసినందుకు ఒక ఐఏఎస్ అధికారిపై కేసు నమోదు చేశారు!. స్మితా సభర్వాల్, ఐఏఎస్, యువజనాభివృద్ధి, పర్యాటక & సంస్కృతి ప్రధాన కార్యదర్శికి తెలంగాణ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. నేరం: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని బుద్ధిహీనంగా బుల్డోజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె AI- రూపొందించిన గిబ్లి చిత్రాన్ని రీట్వీట్ చేశారు. ఈరోజు బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 179 కింద గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న 100 ఎకరాల కంచ గచ్చిబౌలి అడవిని బుల్డోజ్ చేయడంపై సుప్రీంకోర్టు ఈరోజు కొన్ని తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది' అని రేవతి అనే జర్నలిస్టు చేసిన పోస్టును స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications