12న ఓటర్ల తుది జాబితా: తెలంగాణ సీఈఓ రజత్ కుమార్
హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రకటనకు హైకోర్టు అనుమతించిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. అక్టోబర్ 12న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు.
ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, వినతులకు సంబంధించి 33 లక్షల 14 వేలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో కొత్తగా ఓటుహక్కు కోసం వచ్చిన దరఖాస్తులు 22 లక్షల 36 వేలకు పైనే ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 30 లక్షల 872 దరఖాస్తులను ఆమోదించినట్లు వెల్లడించారు.

ముసాయిదా జాబితాలో 2 కోట్ల 61 లక్షల ఓటర్లు ఉండగా.. తుది జాబితాలో మరో 20 లక్షలకు పైగా కొత్త ఓటర్లు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని, ఎలాంటి లోపాలు లేకుండా ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని రజత్‌కుమార్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications