పనికిమాలిన రాజకీయాలు పట్టించుకోం, ‘టి’ ప్రయోజనాలు ముఖ్యం: కెసిఆర్(పిక్చర్స్)

కరీంనగర్: తమకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, ఇతర వ్యక్తులను పట్టించుకోబోమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా నగరంలోని కలెక్టరేట్‌లో వాటర్‌గ్రిడ్ పనుల పురోగతిపై అధికారులతో నిర్వహించిన సమీక్ష అనంతరం కెసిఆర్ మీడియాతో మాట్లాడారు.

త్వరలోనే తెలంగాణ ఇరిగేషన్ పాలసీని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అణిచేసిన సీమాంధ్ర పాలకుల కుట్రల్లో మన నీటి వనరులు కొట్టుకుపోయాయని, ఇందులో భాగమే తప్పుడు ప్రణాళికలతో రూపొందించిన నీటి ప్రాజెక్టులన్నారు. వీటిని సరిదిద్ది ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం సూచించిన 1280 టిఎంసిల నీటిని వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రులు చేసిన నిర్వాకంతో కృష్ణా,గోదావరి నదులపై మహారాష్ట్ర, కర్ణాటకలు 200 ప్రాజెక్టులు నిర్మించాయని, ఫలితంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ఇంద్రావతి, ప్రాణహిత నదులే ఏకైక నీటి ఆధారంగా నిలిచాయన్నారు. ప్రస్తుతము నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల డిజైన్ మార్చి, రీ డిజైన్ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తుంటే, ప్రతిపక్షాల అవతారమెత్తిన అప్పటి అధికార పార్టీలు నెత్తినోరు బాదుకుంటూ, తప్పుడు ప్రచారానికి దిగాయని మండిపడ్డారు.

తాము చేస్తున్న అభివృద్ది పనులన్నీ ఆ పార్టీల ఎదుగుదలకు అవరోధకంగా మారి, ఆ పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దీనిని జీర్ణించుకోలేక తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, పసలేని ఉద్యమాలు చేస్తూ పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నాయని నిప్పులు చెరిగారు.

తమ వక్రబుద్ది వీడి, ప్రజా సంక్షేమంలో పాలుపంచుకోవాలని హితువు పలికారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైనా, ఇప్పటికీ ఉపయోగంలోకి రాని ప్రాజెక్టుల డిజైన్ మార్చి, వినియోగంలోకి తెస్తామన్నారు. సీమాంధ్ర పాలకుల తొత్తులుగా మారిన అప్పటి తెలంగాణ మంత్రులు ఇక్కడి నీటి పారుదల రంగాన్ని నట్టేట ముంచిన వారే, తాము రీడిజైనింగ్ చేస్తుంటే గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు.

ఆరునూరైనా ప్రాణహితచేవెళ్ళ ప్రాజెక్టు డిజైన్ మార్చి, మిడ్‌మానేరుకు నీరందించి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసమే టిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని, సద్విమర్శలు చేస్తే స్వీకరించేందుకు తాము సదాసిద్దమేనని ప్రకటించారు.

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాల నిర్వాకమే గుడుంబా తయారీకి ఆజ్యం పోస్తే, నేడు దానిని అరికట్టేందుకు చీప్‌లిక్కర్ తేవాలని పల్లెల్లో మహిళలే పట్టుబడితే, తమ ప్రభుత్వం అంగీకరించి, నాటుసారాతో మరణాలు ఆపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తమకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, ఇతర వ్యక్తులను పట్టించుకోబోమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

రెండో రోజు పర్యటనలో భాగంగా నగరంలోని కలెక్టరేట్‌లో వాటర్‌గ్రిడ్ పనుల పురోగతిపై అధికారులతో నిర్వహించిన సమీక్ష అనంతరం కెసిఆర్ మీడియాతో మాట్లాడారు.

కెసిఆర్

కెసిఆర్

కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేసినా, వాటి ప్రభావం భవిష్యత్ తరాలపై తీవ్రంగా పడుతుందని చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

ఉద్యమ అనుభవంతో, తెలంగాణ ప్రజలు తమపై ఉంచిన నమ్మకం దృష్ట్యా ఎలాంటి తప్పటడుగులు వేయమని, ఆచితూచి ముందడుగేస్తామని అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాల నిర్వాకమే గుడుంబా తయారీకి ఆజ్యం పోస్తే, నేడు దానిని అరికట్టేందుకు చీప్‌లిక్కర్ తేవాలని పల్లెల్లో మహిళలే పట్టుబడితే, తమ ప్రభుత్వం అంగీకరించి, నాటుసారాతో మరణాలు ఆపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

అయితే, దీనిని ప్రతిపక్షాలు భూతద్దంలో పెట్టిచూపుతూ రాష్ట్రంలో మరో ఉద్యమం తెస్తామంటూ ప్రకటనలు చేస్తున్నాయని, కొన్ని పనికి మాలిన సంఘాలు, కొంతమంది రాజకీయ నాయకులు కలిసి సమ్మెలు, ధర్నాలు, ఆందోళనలవైపు ప్రజల దృష్టిని మళ్ళిస్తున్నారని దుయ్యబట్టారు.

కాంగ్రెస్, టిడిపిల పాలనలో దశాబ్దాల తరబడి మురికికూపాలుగా మారిన పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం తొలగించేందుకు పార్టీలకతీతంగా ప్రతి ప్రజాప్రతినిధి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ఎంపిటిసిలను కూడా సర్పంచ్‌లతో సమానంగా భాగస్వాములను చేసేందుకు ఉత్తర్వులు విడుదల చేస్తామని తెలిపారు. త్వరలోనే పట్టణాల్లో కూడా అపరిశుభ్ర వాతావరణం తొలగించి, వెలుగులు నింపేందుకు పట్టణ జ్యోతి కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అమృత్, స్మార్ట్‌సిటీల ఎంపిక పూర్తయిన అనంతరం మున్సిపాల్టీల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. కెజి టు పిజి విద్యా విధానంపై ప్రభుత్వం నిర్దిష్ట నిర్ణయంతో ఉందని, పక్కా ప్రణాళికతో విద్యారంగంలో మేధావులతో త్వరలోనే సమావేశం ఏర్పాటుచేసి, సరైన సలహాలతో అమలు చేసేందుకు కార్యచరణ రూపొందిస్తామన్నారు.

గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో లైడార్ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. సర్వే నివేదిక వచ్చిన అనంతరం మరిన్ని అదనపు ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రణాళిక రూపొందించనున్నట్లు చెప్పారు.

రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఇప్పటివరకు ప్రధానికి 50లేఖలు రాసానని, ఆరేడు సార్లు వ్యక్తిగతంగా ప్రధానితోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జెట్లీని కలిసానని, మరోమారు కూడా చైనా పర్యటనకు ముందు కలిసి కోరుతానని అన్నారు.

దీంతో పాటుగా 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రానికి రుణ పరిమితిని 3.5శాతం పెంచేందుకు అనుమతివ్వాలంటూ కేంద్రాన్ని కోరునున్నట్లు తెలిపారు. విద్యుత్ ఉత్పాదక కేంద్రాలను దక్షిణ తెలంగాణలో కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీని అడుక్కు తొక్కింది ఆంధ్రా పాలకులేనని, కొత్త రాష్ట్రంలో నష్టాలు నివారించేందుకు అవసరమైన ఆర్దిక సాయం చేస్తున్నట్లు చెప్పారు.

మైనార్టీల రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వం నియమించిన రెండు కమిటీల నివేదికలు అందగానే, అమలుకు చర్యలు చేపడుతామని స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టుబోతున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+