Rain alert: తెలంగాణలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా, బుధ, గురువారాల్లో తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం జార్ఖండ్ పై ఏర్పడిన అల్పపీడనం, మంగళవారం మధ్యప్రదేశ్‌పైకి విస్తరించినట్లు వాతావరణ అధికారులు తెలిపారు.

అల్పపీడనంకు అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే, బంగాళాఖాతంపై 4.5 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం విస్తరించివుంది. దీంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతోనే తెలంగాణ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

మంగళవారం హైదరాబాద్ నగరతోపాటు ఇతర తెలంగాణ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.కాగా, సంగారెడ్డి జిల్లా కంగ్టిలో అత్యధికంగా 8.7 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది.

weather alert: next two days heavy rains in telangana districts

మరోవైపు, బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జోగులాంబ గద్వాల, వికారాబాద్, ఆదిలాబాద్, అసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం పడింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది.

జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రాణహిత నుంచి వస్తున్న వరదతో కాళేశ్వరం ప్రాజెక్టు నిండిపోయింది. దీంతో మేడిగడ్డ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. ఎగువ నుంచి వస్తున్ న వరదను దిగువకు వదులుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+