హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో తీవ్రమైన ఎండలు, ఆరెంజ్ అలర్ట్ జారీ: ఏపీలోనూ, ఈదురుగాలులతో వర్షాలు కూడా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. మార్చి, ఏప్రిల్ నెలల మాదిరగానే మే నెలలోనూ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నప్పటికీ.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉండనుందని వెల్లడించింది.

తెలంగాణలో నాలుగు రోజులపాటు తీవ్రమైన ఎండలు

తెలంగాణలో నాలుగు రోజులపాటు తీవ్రమైన ఎండలు

తెలంగాణలో వచ్చే నాలుగు రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వడగాలులు కూడా ఎక్కువగా వీచే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో 45-47 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. పిల్లలు, వృద్ధులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రావొద్దని సూచించింది. అవసరమైతే తప్ప బయట తిరగొద్దని స్పష్టం చేసింది.

తెలంగాణలో వడగాలులు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

తెలంగాణలో వడగాలులు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

సాధారణంగా మే నెల మధ్య నుంచి వడగాలులు వీస్తుంటాయి కానీ, ఈసారి మాత్రం మే మొదటి వారం నుంచే తీవ్రమైన వడగాలులున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మే నెలలో రాత్రి సమయంలో కూడా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

ఈ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు.. వడదెబ్బకు నలుగురు మృతి

ఈ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు.. వడదెబ్బకు నలుగురు మృతి

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉండనున్నాయని వతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో వడదెబ్బ తగిలి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్పూర్ మండలం రాజులగూడకు చెందిన గుణాజీ అనే ఆరేళ్ల బాలుడు, అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ బాలాజీ(45) వదదెబ్బ తగిలి మరణించారు. సూర్యపేట జిల్లా నాగారం మండలం ఈటూరుకు చెందిన రైతు తిగుళ్ల అంజయ్య(48), యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రెడ్డి నాయక్ తండాకు చెందిన బుజ్జమ్మ(45) వడగాలులకు ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలోనూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు

ఏపీలోనూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు

ఏపీలోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే నమోదువుతున్నాయి. రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు, నంద్యాల, కడప, రాయచోటి, అనంతరం, పుట్టపర్తి జిల్లాలో ఎండలు తీవ్రంగా ఉంటున్నాయని, మరికొద్ది వారాలపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది. అయితే, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా ఈ మధ్య కాలంలో కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా

ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా


ఇది ఇలావుండగా, విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు గాలుల్లో అస్థిరత కొనసాగుతోంది. 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. ఆ సమయంలో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

English summary
Weather: telangana to record highest temperature next four days, orange alert issued.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X