సూపర్ ఫీల్ ఇక్కడ.. హైదరాబాద్ నుంచి 100 కి. మీ. దూరంలోనే.. డోంట్ మిస్..

వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ ప్రజలు సినిమాలు, షికార్లు అని గడుపుతుంటారు. సిటీని మొత్తం చుట్టేస్తారు. లేదంటే హ్యాపీగా ఇంట్లోనే వీకెండ్ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే హైదరాబాద్ కు కేవలం 100 కి. మీ దూరంలోనే మిమ్మల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్లే ప్రదేశం ఉందని మీకు తెలుసా..? ఆ ప్రదేశానికి వెళ్లడం కూడా ఓ ప్రత్యేకమైన అనుభూతి. అది కూడా అడవి మార్గంలో.. సూపర్ ఫీలింగ్ ఉంటుంది ఈ జర్నీ. వీకెండ్ కు ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఈ వెకేషన్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. అడవి, వైల్డ్ లైఫ్ శాంక్చురీలను దాటుకుంటూ ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు. చుట్టూ అడవి, జంతువులు, పక్షులు.. ఇలా ఒక్కటేమిటి అన్నీ ఈ ప్రాంతంలో కనువిందు చేస్తాయి.

పోచారం రిజర్వాయర్.. మెదక్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆనకట్టను 1916-1922 మధ్య మంజీరా నదికి ఉపనది అయిన ఆలేరు నదిపై నిర్మించారు. రిజర్వాయర్ సమీపంలో ఉన్న నిజాం బంగ్లా 1918 లో నిర్మించారు. దీనికి సమీపంలో పోచారం వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఉంది. ఇది పర్యాటకులకు ఆకర్షణీయమైన ప్రదేశంగా చెప్పవచ్చు. అంతేకాక రిజర్వాయర్ మధ్యలో ఉన్న ద్వీపానికి చేరుకోవడానికి పడవలు అందుబాటులో ఉంటాయి.

ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే నర్సాపూర్‌ అటవీ ప్రాంతం, పోచారం వైల్డ్‌లైఫ్‌ శాంక్చురీని దాటుకుని వెళ్లాలి. ఈ జర్నీ సరికొత్త అనుభూతిగా ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు నర్సాపూర్‌ అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు నుంచి ప్రారంభం ఉంటుంది. ఈ పార్కులో ట్రెక్కింగ్, బర్డింగ్, బట్టర్‌ ఫ్లై వాక్, వెట్‌ ల్యాండ్‌ విజిట్‌ అన్నీ ఉంటాయి. నర్సాపూర్‌ పార్క్‌ కు ఎదురుగానున్న అటవీప్రాంతంలో సందర్శించవచ్చు. అక్కడ నుంచి నర్సాపూర్‌ పట్టణానికీ వెళ్లొచ్చు.

Weekend Bliss at Pocharam Reservoir Forest and Wildlife Sanctuary Escape

ఇక పోచారం వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురీలో వైల్డ్‌ లైఫ్‌ సఫారీ, పోచారం డ్యామ్, నిజాం హెరిటేజ్‌ బిల్డింగ్స్‌ సందర్శన, సూర్యాస్తమయ వీక్షణ తదితర ప్రదేశాలను చూడొచ్చు. అలాగే శాంక్చురీలో బర్డ్‌ వాచింగ్, బట్టర్‌ ఫ్లై వాక్‌ కూడా ఉంది. పోచారం వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురీ 130 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. మెదక్, కామారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించి ఉంటుంది. ఇక్కడ వివిధ రకాల జింకలు, చిరుతలు, ఎలుగుబంట్లు కనిపిస్తుంటాయి. అలాగే పలు రకాల అరుదైన పక్షులకూ ఇది కేంద్రంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+