కేంద్రమంత్రిగా తెలంగాణా కోసం ఏం చేశావ్ ? హుందాగా ఉండు, చిల్లర రాజకీయాలొద్దు : ఎర్రబెల్లి ధ్వజం

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి నిర్వహిస్తున్న జన ఆశీర్వాద యాత్ర ఫెయిల్యూర్ యాత్ర అంటూ నిప్పులు చెరిగారు. కిషన్ రెడ్డి హుందాగా ప్రవర్తించాలని, చిల్లర రాజకీయాలు చేయొద్దంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ఇప్పటివరకు ఇచ్చింది ఏంటో చెప్పాలని ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.

 తెలంగాణా కోసం కేంద్రం ఏం చేసిందో చెప్పాలి

తెలంగాణా కోసం కేంద్రం ఏం చేసిందో చెప్పాలి

తెలంగాణలో టూరిజంకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. గిరిజన యూనివర్సిటీ కోసం ములుగులో స్థలం కేటాయించామని పేర్కొన్న ఆయన దానికి ఇప్పటివరకు కేంద్రం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. విభజన చట్టంలోని ఏ హామీని కేంద్రం అమలు చేయడం లేదని, తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రం ఏం చేసిందని కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారని విమర్శించారు .

 కేంద్ర మంత్రిగా రెండేళ్లుగా మీరు రాష్ట్రానికి ఏం చేశారు

కేంద్ర మంత్రిగా రెండేళ్లుగా మీరు రాష్ట్రానికి ఏం చేశారు

కేంద్ర మంత్రిగా రెండేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని కిషన్ రెడ్డి ని డిమాండ్ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటా కాకుండా అదనంగా తెలంగాణకు ఏం సాయం చేశారు గణాంకాలతో సహా వెల్లడించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడే బండి సంజయ్ పరువు తీసుకున్నారని పేర్కొన్నారు . ఇకనైనా కిషన్ రెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలని హితవు పలికారు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కేంద్రం ప్రశంసించింది గుర్తు చేసిన ఎర్రబెల్లి, దీనికి కేంద్రం నిధులు ఇవ్వలేదంటూ ఆరోపించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర .. టీఆర్ఎస్ పై ధ్వజం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర .. టీఆర్ఎస్ పై ధ్వజం

జన ఆశీర్వాద యాత్ర చేపట్టిన కిషన్ రెడ్డి ఖమ్మం జిల్లా కోదాడ నుండి జన ఆశీర్వాద యాత్ర మొదలు పెట్టి వరంగల్ మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా, సికింద్రాబాద్ నియోజకవర్గంలో, ఈరోజు రాత్రికి సికింద్రాబాద్ పార్టీ కార్యాలయానికి చేరుకోనున్న విషయం తెలిసిందే. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా పర్యటన చేస్తున్న కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ సీఎంగా కొనసాగితే తెలంగాణ అధ్వానంగా మారుతుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

Recommended Video

    Spl Coverage on Muralidhar rao Comments
    మరో రెండేళ్లలో తెలంగాణా టీఆర్ఎస్ అడ్రెస్ గల్లంతు వ్యాఖ్యలపై ఎర్రబెల్లి ధ్వజం

    మరో రెండేళ్లలో తెలంగాణా టీఆర్ఎస్ అడ్రెస్ గల్లంతు వ్యాఖ్యలపై ఎర్రబెల్లి ధ్వజం

    మరో రెండేళ్లలో తెలంగాణాలో టీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోతుంది అంటూ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని పేర్కొన్న ఆయన హుజరాబాద్ లో కెసిఆర్ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది అని, బీజేపీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని ఒకరో ఇద్దరో గెలిచినా తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరతారని కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన కూడా ధ్వజమెత్తారు. అడుగడుగునా తెలంగాణ సర్కార్ పై విరుచుకుపడుతూ, కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి చేసిన లబ్దిని గురించి వివరిస్తూ సాగిన యాత్రపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిప్పులు చెరుగుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+