వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యాబినెట్ లో మహిళలు లేకుంటే ఏం ... ఇంట్లో ఉన్నారుగా ... మంత్రి జగదీశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కే కాదు, టిఆర్ఎస్ పార్టీ లోని మంత్రులకు, నేతలకు మహిళల పట్ల ఇంకా వివక్ష ఉంది అనేది తాజాగా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటలతోనే అర్థమవుతోంది. మంత్రివర్గ విస్తరణ జరిగిన తరువాత విద్యా శాఖ మాత్యులు జగదీశ్వర్ రెడ్డి క్యాబినెట్లో మహిళలకు స్థానం కల్పించకపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ప్రమాణం చేసిన పాత మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డిని క్యాబినెట్ లో మహిళలకు స్థానం ఎందుకు కల్పించలేదు అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన షాకింగ్ సమాధానం ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.

క్యాబినెట్లో మహిళలు లేరన్న ప్రశ్నకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి షాకింగ్ సమాధానం

క్యాబినెట్లో మహిళలు లేరన్న ప్రశ్నకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి షాకింగ్ సమాధానం

"మహిళలు క్యాబినెట్లో లేకుంటే ఏం... మహిళలు ఇంట్లో ఉన్నారు కదా" అని మంత్రి వర్యులు నోరు జారారు. మళ్లీ వెంటనే కవర్ చేసుకుంటూ మహిళలు ఇంట్లో ఉంటూ మాకు సపోర్ట్ చేస్తున్నారు కదా అంటూ చెప్పారు.
అయితే విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటలపై సోషల్ మీడియా లో దుమారం రేగింది. మహిళల పట్ల అటు గులాబీ బాస్ కే కాదు, గులాబీ పార్టీలోని నేతలకు సైతం చిన్న చూపు ఉన్నట్లుగా ఆయన మాటల్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు అని ప్రచారం జరుగుతుంది.

విద్యా శాఖామంత్రి తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి .. కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ళ శారద

విద్యా శాఖామంత్రి తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి .. కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ళ శారద

విద్యాశాఖామంత్రిగా పాఠశాల విద్య నుండి స్త్రీ, పురుష సమానత్వాన్ని నేర్పించాల్సిన మంత్రివర్యులు, ఇలా అసమానతలను తెలియజేసేలాగా మాట్లాడటం మహిళా సమాజం ఖండిస్తుంది. మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటల పై అసహనం వ్యక్తం చేసిన తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద మంత్రి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.మహిళల పట్ల ఇంతటి వివక్ష పనికిరాదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాబినెట్లో మహిళలకు అవకాశం ఇవ్వని అంశంపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పిన సమాధానం విలేకరులనే కాదు యావత్ తెలంగాణ ప్రజలను షాక్ కి గురి చేసింది.

నోరు మెదపని టీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు ..

నోరు మెదపని టీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు ..

గత ప్రభుత్వంలో నే మహిళలకు కేబినెట్లో స్థానం ఇవ్వకుండా పలు విమర్శలు ఎదుర్కొన్న గులాబీ బాస్ తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో నూ మహిళలకు స్థానం ఇవ్వలేదు. ఈసారి కచ్చితంగా అవకాశం ఇస్తారని అందరూ భావిస్తే ఊహించని విధంగా గులాబీ బాస్ కేసీఆర్ షాక్ ఇచ్చారు. కేసీఆర్ మహిళల విషయంలో చూపిస్తున్న వివక్షపై మహిళలకు అసంతృప్తి వున్నా పార్టీలోని మహిళలే నోరు మెదపనప్పుడు తామెందుకు మాట్లాడాలి అని భావిస్తున్నారు. ఎప్పుడైతే పార్టీలోని మహిళా ఎమ్మెల్యేలు ఈ విషయంపై నోరు మెదుపుతారో అప్పుడు తప్పక మహిళా సమాజం వారికి అండగా పోరాటం చేసే ఆలోచనలో ఉంది.

మహిళలకు స్థానం ఇవ్వకపోవటంపై ఇప్పటికే వెల్లువెత్తుతున్న నిరసన

మహిళలకు స్థానం ఇవ్వకపోవటంపై ఇప్పటికే వెల్లువెత్తుతున్న నిరసన

మొన్నటికి మొన్న రాజ్ భవన్లో జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ సీనియర్ మహిళా ఎమ్మెల్యే కంటతడి పెట్టింది అంటే అవి ఆనందభాష్పాలు అయ్యి వుండొచ్చు కదా అని ఓ టిఆర్ఎస్ నాయకుడు మాట్లాడితే, ఇక తాజాగా మంత్రివర్యులే "తెలంగాణ క్యాబినెట్ లో మహిళలు లేకుంటే ఏం... ఇంట్లో ఉన్నారు కదా" అని మాట్లాడడం చర్చకు దారితీస్తోంది. ఇక కొందరైతే ఏ స్వామీజీనో మహిళలకు క్యాబినెట్లో అవకాశం ఇస్తే గులాబీ బాస్ కి ఇబ్బంది ఉంటుందని చెప్పారు కావచ్చు. అందుకే కేసిఆర్ మహిళలకు కేబినెట్లో స్థానం కల్పించడం లేదు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మంత్రివర్గంలో మహిళ కు ఎందుకు స్థానం కల్పించలేదన్నది అందరినీ ఆలోచింపజేస్తున్న అంశం.

English summary
"No woman minister in telangana cabinet" this issue leads to a hot discussion in the state. The new education minister jagadishwar reddy commented on women it becomes a contorversy in the state now . Minister Jagadishwar reddy spoke with media and the media's questioned the minister why the newly-appointed cabinet did not provide a place for women.. The minster replied What if the Cabinet is not ... Women are at home? Women are still at home and they are supporting us again. The words of Jagdishwar Reddy about the women are viral in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X