Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అధికారంలో ఉండి ధర్నాలు చేయడం ఏంది.!ప్రజల దృష్టి మళ్లించేందుకేనన్న కాంగ్రెస్.!

హైదరాబాద్ : అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ మరోసారి ద్వజమెత్తింది. రైతు సమస్యలతో పాటు నిరుద్యోగ సమస్యలు కూడా పేరుకుపోయాయని, వాటి పరిష్కారానికి కూడా ధర్నాలు చేస్తారా అని గులాబీ పార్టీని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని, రోజుకు ఒకరిద్దరు నిరుద్యోగులు ఆత్మహత్య లు చేసుకుంటున్నా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావులో చలనం లేదని యూత్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

 విద్యార్థి సమస్యలపై సమరశంఖారావం పూరిస్తాం.. ఆత్మహత్యలు వద్దన్న యూత్ కాంగ్రెస్

విద్యార్థి సమస్యలపై సమరశంఖారావం పూరిస్తాం.. ఆత్మహత్యలు వద్దన్న యూత్ కాంగ్రెస్

రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 200 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని, చనిపోయేముందు లేఖల రూపంలో కారణం చెప్పి మరీ చనిపోయారని యూత్ కాంగ్రెస్ నేత శివసేనా రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. అంతే కాకుండా సెల్ఫీ వీడియో ద్వారా సమస్యలు చెప్పి మరి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్న దౌర్బాగ్యపు స్థితిలో తెలంగాణ ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. వీరే కాకుండా బయటకు చెప్పకుండా విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారని, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కూలి నాలి చేసి పిల్లల్ని కష్టపడి చదివిస్తే వాళ్లకు ఉద్యోగాలు రాకపోవడంతో రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

 ఉద్యోగాల నోటిఫికేషన్ ఎందుకివ్వరు.? టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డ శివసేనారెడ్డి

ఉద్యోగాల నోటిఫికేషన్ ఎందుకివ్వరు.? టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డ శివసేనారెడ్డి

ఇదిలా ఉండగా తమ పిల్లలకు ఉద్యోగం వస్తే కుటుంబం అంత బాగుపడుతుందని కలలు కంటున్న తల్లిదండ్రులకు కడుపుకోత తప్ప మరేం మిగలడంలేదని అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయని యూత్ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ వచ్చినప్పుడే ఉద్యోగాలు ఇచ్చి ఉంటే వేలాది మంది జీవితాలు బాగుపడేవని, ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఆ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే లక్షల మంది జీవితాల్లో వెలుగులు నిండేవని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. యువకులకు ఉద్యోగాలు లేవు, విద్యార్థులకు ఫీజ్ రిఎంబేర్స్మెంట్ లేదు, నిరుద్యోగ భృతి లేదని మండిపడ్డరు.

 ఉద్యోగాలు కల్పించకపోతే యుద్దమే.. తెలంగాణ ప్రభుత్వాన్నా హెచ్చరించిన యూత్ కాంగ్రెస్

ఉద్యోగాలు కల్పించకపోతే యుద్దమే.. తెలంగాణ ప్రభుత్వాన్నా హెచ్చరించిన యూత్ కాంగ్రెస్

అంతే కాకుండా 1200 మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ వచ్చిందని, ఇప్పుడు మరో 200 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగ బంధు ఇవ్వాలని డిమాండ్ చేసారు. ప్రతి నిరుద్యోగికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, డిసెంబర్ 1 నాటికి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చెయ్యకపోతే, నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే నిరుద్యోగ శంఖారావం పూరిస్తామని హెచ్చరించారు. నిరుద్యోగులు ఆత్మహత్య లకు పాల్పడవద్దని, అధికార పార్టీ నేతలను ఉద్యోగాల కల్పనలో నిలదీద్దామని, మొండిగా వ్యవహరిస్తున్న గులాబీ ప్రభుత్వంపై పోరాట ఉదృతం చేద్దామని నిరుద్యోగ యువతకు యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. నిరుద్యోగ యువతకు యూత్ కాంగ్రెస్ అండగా ఉంటుందని శివపేనా రెడ్డి భరోసా ఇచ్చారు.

Recommended Video

    Telangana: Temperature Dips, Rapidly Falling in TS
     బీజేపి తో టీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం.. అందుకే దొంగ ధీక్షలు, ధర్నాలు అంటున్న కాంగ్రెస్

    బీజేపి తో టీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం.. అందుకే దొంగ ధీక్షలు, ధర్నాలు అంటున్న కాంగ్రెస్

    అంతే కాకుండా వర్షాకాలం వరి వేయకముందే వరి ధాన్యం పై కేంద్రం లేఖ రాసిందని, లేఖ ఇప్పుడే అందినట్లు సీఎం చంద్రశేఖర్ రావు చెప్తున్నాడని, వ్యవసాయ చట్టాలు వచ్చి సంవత్సరం అయిందని, ఇన్ని రోజులు చంద్రశేఖర్ రావు ఏంచేసారని జాతీయ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి ప్రశ్నించారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసే కంటే ముందు, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సవాల్ విసిరారు. అధికారంలో ఉన్న పార్టీ లు ధర్నా చేయడం ఏంటని, బీజేపీ, టిఆర్ఎస్ మధ్య లోపాయకారి ఓప్పందం ప్రకారమే దీక్షలు, దర్నాలు జరుగుతున్నాయని టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+