రేవంత్‌కు ట్విస్ట్ ఇచ్చిన కంచర్ల: కోమటిరెడ్డే కారణమా, కారెక్కుతారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

నల్గొండ: రేవంత్‌రెడ్డి వెంట నడిచేందుకు ప్రయత్నించి చివరి నిమిషంలో కంచర్ల భూపాల్‌రెడ్డి ఆగిపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరకుండా భూపాల్‌రెడ్డి వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నారు. అయితే కొంత కాలంగా భూపాల్‌రెడ్డిని టిఆర్ఎస్‌లోకి ఆ పార్టీ కూడ ఆహ్వనిస్తోంది.ఈ పరిణామాలతో భూపాల్‌రెడ్డి డైలమాలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.

రేవంత్ ఎపిసోడ్: టిటిడిపి నేతలతో రేపు బాబు మీటింగ్, సండ్రకు ఎల్పీనేతగా ఛాన్స్

అక్టోబర్ 30వ, తేదిన హైద్రాబాద్‌లో రేవంత్‌రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి కంచర్ల భూపాల్‌రెడ్డి హజరయ్యారు. ఈ సమావేశానికి రాకముందే భూపాల్‌రెడ్డికి పార్టీ షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. భూపాల్‌రెడ్డి అమరావతిలో జరిగిన పార్టీ సమావేశ వివరాలను మీడియాకు లీక్ చేశారని భూపాల్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు.

రేవంత్ ఎపిసోడ్: టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌, నేతలకు బంపరాఫర్లు

రేవంత్‌రెడ్డి వెంట భూపాల్‌రెడ్డి ఢిల్లీకి వెళ్ళలేదు. కానీ, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పటేల్ రమేష్‌రెడ్డి, బిల్యానాయక్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ, కంచర్ల భూపాల్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. రేవంత్ వెంట ఢిల్లీకి వెళ్ళలేదు.

సీతక్క టిడిపికి ట్విస్ట్: రేవంత్ సతీమణి ప్లాన్, ఫోన్ స్విచ్ఛాప్ అందుకేనా?

 కంచర్ల భూపాల్‌రెడ్డి పయనమెటు?

కంచర్ల భూపాల్‌రెడ్డి పయనమెటు?

నల్గొండ టిడిపి ఇంచార్జీగా ఉన్న కంచర్ల భూపాల్‌రెడ్డి .. అనుహ్యంగా రేవంత్‌ వెంట వెళ్ళకుండా ఆగిపోయారు. కాంగ్రెస్ పార్టీలో భూపాల్‌రెడ్డి చేరలేదు. కాంగ్రెస్ పార్టీలో భూపాల్‌రెడ్డి చేరితే 2019 ఎన్నికల్లో నల్గొండ నుండి ఆయనకు టిక్కెట్టు దక్కే అవకాశం లేదు. 1999 నుండి ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధిస్తూ వచ్చిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాదని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భూపాల్‌రెడ్డి టిక్కెట్టు ఇచ్చే అవకాశం లేదు. దీంతో భూపాల్‌రెడ్డి పునరాలోచనలో పడినట్టు ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే భూపాల్‌రెడ్డి రేవంత్‌రెడ్డి వెంట వెళ్ళకుండా ఆగిపోయారని అంటున్నారు.

 భూపాల్‌రెడ్డికి టిఆర్ఎస్‌ నుండి పిలుపు

భూపాల్‌రెడ్డికి టిఆర్ఎస్‌ నుండి పిలుపు

టిఆర్ఎస్ నుండి కూడ కంచర్ల భూపాల్‌రెడ్డికి పిలుపు వస్తోందని ప్రచారం సాగుతోంది. ఒకవేళ నల్గొండ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరిగే పరిస్థితి ఉత్పన్నమైతే ఆ సమయంలోనే భూపాల్‌రెడ్డి టిఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే నల్గొండ పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక జరిగే అవకాశం కన్పించడం లేదు. టిడిపిలో చోటుచేసుకొంటున్న పరిణామాల నేపథ్యంలో కొంతకాలంగా భూపాల్‌రెడ్డిని టిఆర్ఎస్‌లో చేరాలని ఆ పార్టీ నేతలు ఆహ్వనిస్తున్నారు.

 సుఖేందర్‌రెడ్డిని కాదని టిడిపిలోనే

సుఖేందర్‌రెడ్డిని కాదని టిడిపిలోనే

2009 ఎన్నికల సమయంలో సుఖేందర్‌రెడ్డి టిడిపిని వీడారు. ఆ సమయంలో భూపాల్‌రెడ్డి కూడ సుఖేందర్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండు రోజులకే భూపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. అప్పటి నుండి భూపాల్‌రెడ్డి టిడిపిలోనే కొనసాగుతున్నారు. నల్గొండ అసెంబ్లీ ఇంచార్జీగా ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. భూపాల్‌రెడ్డిపై కోమటిరెడ్డి విజయం సాధించారు. సుఖేందర్‌రెడ్డి తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారని పలుమార్లు భూపాల్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్ ఎపిసోడ్ సమంలో చంద్రబాబుతో జరిగిన సమావేవంలో కూడ భూపాల్‌రెడ్డి పార్టీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించారు.

 రేవంత్ సూచనమేరకు భూపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరలేదా?

రేవంత్ సూచనమేరకు భూపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరలేదా?

నల్గొండ టిక్కెట్టు విషయమై కాంగ్రెస్ పార్టీ నుండి స్పష్టమైన హమీ ఉంటేనే కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్... భూపాల్‌రెడ్డికి సూచించారనే ప్రచారం కూడ ఉంది. ఈ తరుణంలోనే రేవంత్‌వెంట భూపాల్‌రెడ్డి ఢిల్లీకి వెళ్ళకుండా ఉన్నారనే ప్రచారం కూడ సాగుతోంది. భూపాల్‌రెడ్డి టిఆర్ఎస్‌లో చేరుతారా, రేవంత్‌ వెంట కాంగ్రెస్‌లో చేరుతారా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే సీఎం నుండి స్పష్టమైన హమీ వస్తేనే టిఆర్ఎస్‌లో చేరేందుకు భూపాల్‌రెడ్డి సంసిద్దతను వ్యక్తం చేసినట్టు ప్రచారం సాగుతోంది. మరో వైపు భూపాల్‌రెడ్డి టిఆర్ఎస్‌లో చేరడాన్ని పార్టీలో మరో వర్గం వ్యతిరేకిస్తోందనే ప్రచారం కూడ సాగుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kancharla Bhupal Reddy didn't on join in congress party.he was attended Revanth's meeting held at Hyderabad on Oct 30.But he didn't joi in Congress. He wanting Congress party ticket from Nalgonda Assembly segment in 2019, but not assurance from Revanth reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి