హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.300 కోట్ల లావాదేవీలు, మార్పిడి: రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ దాడులు ఎందుకంటే?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/కొడంగల్: కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి నివాసం, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖతో పాటు ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం 15 చోట్ల ఈ దాడులు నిర్వహిస్తున్నారు. రేవంత్ సోదరుడు, బంధువుల ఇళ్లలోను తనిఖీలు చేస్తున్నారు. ప్రతి ఐటీ బృందంలో ఓ ఈడీ అధికారి ఉన్నారు.

Recommended Video

రేవంత్ ఇంటి పై ఆదాయపన్ను శాఖ దాడులు

శ్రీసాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి సుమారు రూ.300 కోట్ల ఆర్థిక లావాదేవీలు కొనసాగించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ డబ్బు ద్వారా వారు సుమారు పది నుంచి 15 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

'ఇక్కడి నుంచి ఉత్తరాలు, ఢిల్లీ నుంచి ఆధికారులు, అందుకే రేవంత్ ఇంటిపై ఐటీ దాడులు''ఇక్కడి నుంచి ఉత్తరాలు, ఢిల్లీ నుంచి ఆధికారులు, అందుకే రేవంత్ ఇంటిపై ఐటీ దాడులు'

రేవంత్, ఫ్యామిలీ డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలకే డబ్బులు బదలీ

రేవంత్, ఫ్యామిలీ డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలకే డబ్బులు బదలీ

రేవంత్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా కొనసాగుతున్న కంపెనీలకే డబ్బులు బదలీ అయినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దాడులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి రెండు ఐటీ బృందాలు వచ్చాయి. ప్రతి బృందంలో ఓ ఈడీ అధికారి ఉన్నారు. రేవంత్ సోదరుడి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పైనా సోదాలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం కొడంగల్‌లో ప్రచారంలో ఉన్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఇంటికి వచ్చారు.

అడ్వోకేట్ వేసిన పిటిషన్ మేరకు..

అడ్వోకేట్ వేసిన పిటిషన్ మేరకు..


రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులపై వివిధ రకాల ప్రచారం సాగింది. గతంలో ఓ అడ్వోకేట్ వేసిన పిటిషన్ మేరకే ఈ దాడులు నిర్వహిస్తున్నారని అంటున్నారు. కోట్ల రూపాయల్లో మార్పిడి జరిగిందని అడ్వోకేట్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కారణంగా ఐటీ అధికారులు వచ్చారని, ఇందులో తెరాసకు సంబంధం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

తెరాసకు సంబంధం లేదని పాతూరి

తెరాసకు సంబంధం లేదని పాతూరి

రేవంత్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులతో తెరాసకు సంబంధం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి గురువారం అన్నారు. కేంద్ర సంస్థల దాడులతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. అనవసర ఆరోపణలతో రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతోందన్నారు. కాంగ్రెస్ నేతలు చవకబారు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. నేర చరితులు ఏ పార్టీలో ఉన్నా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఓటుకు నోటు, హౌసింగ్ సొసైటీ అక్రమాలు

ఓటుకు నోటు, హౌసింగ్ సొసైటీ అక్రమాలు

రేవంత్ రెడ్డిపై ఆదాయపన్ను, ఈడీ అధికారుల దాడుల నేపథ్యంలో గతంలోని ఓటుకు నోటు అంశంపై కూడా చర్చ సాగుతోంది. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.కోటి డీల్‌ కుదిర్చారని రేవంత్‌పై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. నాడు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి కేవలం రూ.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మొత్తం కూడా బదిలీ అయిన విషయాన్ని ఏసీబీ గుర్తించలేదు. కొద్దిరోజుల క్రితం ఈ కేసును ఏసీబీ అధికారులు ఈడీకి అప్పగించింది. ఇందులో భాగంగా కూడా ఈడీ అధికారులు రేవంత్ ఇళ్లతో పాటు కార్యాలయాలపై సోదాలు చేపట్టారని అంటున్నారు. అలాగే, కొద్ది రోజుల క్రితం జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ జూబ్లీహిల్స్ పోలీసులు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశాయి.

English summary
Officials of the Income Tax department reportedly conducted raids at the properties belonging to Congress leader Revanth Reddy in Hyderabad and across Telangana on Thursday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X