వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కొండా సురేఖకు టిక్కెట్ ఇస్తే, కూతురుకు, భర్తకు అడగడమా, మీరెంతమందిని తీసుకొచ్చారు?'

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: కేసీఆర్, కేటీఆర్, తెరాసలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతల ఆగ్రహానికి కారణం అవుతోంది. తెరాస నేతలు గుండు సుధారాణి, నగర మేయర్ నన్నపనేని నరేందర్‌లు ఆమెపై విరుచుకుపడ్డారు. ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్‌లు కూడా ధ్వజమెత్తారు.

చదవండి: కూతురు కోసం పట్టు: 12న కాంగ్రెస్‌లోకి కొండా సురేఖ! అందుకే కేసీఆర్ తీవ్ర అగ్రహం

బీసీ మహిళగా కొండా సురేఖకు పార్టీ టికెట్‌ ఇచ్చి అవకాశం కల్పిస్తే, భర్తకు, కూతురుకు టిక్కెట్లు కావాలని అడగడం సరికాదని ఎంపీలు అన్నారు. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి వారికి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు అసెంబ్లీ సీటును ప్రకటించకపోవవడానికి మీ దురుసు ప్రవర్తనే కారణమన్నారు.

Why Konda Surekha is asking ticket for daughter and husband, TRS leaders

కాంగ్రెస్‌‌లో ఉన్న విష సంస్కృతిని ఇక్కడ సహించమని చెప్పారు. పార్టీ టికెట్ల కేటాయింపులో పూర్తి స్థాయి అధికారాన్ని కేసీఆర్‌కు అప్పగించారని చెప్పారు. ఇక అలాంటప్పుడు పార్టీ నిర్ణయాన్ని ఏ ఒక్కరు విమర్శించలేరన్నారు. కొంగరకలాన్‌లో నిర్వహించిన బహిరంగ సభకు మీరు ఎంతమందిని తరలించారో చెప్పాలన్నారు.

చదవండి: తెలంగాణపై పవన్ చేతులెత్తేసినట్లేనా? ఆయన పాత్ర కీలకంగా మారనుందా?

కొండా మురళీ సొంతబలంతో ఎమ్మెల్సీగా గెలిచారని చెబుతున్నారని, అలాంటప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ చేశారు. కాగా, కొండా దంపతులు తెరాసపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.

English summary
Why Former Minister Konda Surekha is asking ticket for daughter and husband, TRS leaders question.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X