కూతురు కోసం పట్టు: 12న కాంగ్రెస్‌లోకి కొండా సురేఖ! అందుకే కేసీఆర్ తీవ్ర అగ్రహం

Recommended Video

    సొంత‌గూటికి టీఆర్‌ఎస్ నేతలు....!

    వరంగల్: కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిలు ఈ నెల 12వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ముహూర్తం ఖరారయిందని తెలుస్తోంది. ఈ రోజు (శనివారం) ప్రెస్ మీట్ పెట్టి, కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం ప్రకటించనున్నారని సమాచారం. ఉమ్మడి వరంగల్‌లో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 11 మందిని ప్రకటించిన కేసీఆర్, కొండా సురేఖ ప్రాతినిథ్యం వహించిన వరంగల్ తూర్పును పెండింగ్‌లో పెట్టారు.

    చదవండి: టీడీపీ ఎమ్మెల్యేలకు, అరుణ సోదరుడికి టిక్కెట్: కేసీఆర్ ప్లాన్‌తో ఒత్తిడిలో విపక్షాలు

    కాంగ్రెస్‌ తరఫున రెండు స్థానాలు కేటాయించేందుకు అధిష్ఠానం నుంచి హామీ ఇచ్చిందని సమాచారం. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కొండా సురేఖ హైదరాబాద్ వచ్చి పార్టీ నేతలతో చర్చలు జరిపారని తెలుస్తోంది. వారు ఈ నెల 12న గులాం నబీ ఆజాద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని అంటున్నారు. అయితే వారు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు.

    చదవండి: టీఆర్ఎస్‌కు షాకిస్తారా?: సొంత గూటికి కొండా సురేఖ!, ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ

    కూతురు కోసం.. పార్టీ వీడినా కేసీఆర్ లైట్

    కూతురు కోసం.. పార్టీ వీడినా కేసీఆర్ లైట్

    కొండా సురేఖ రెండు టిక్కెట్ల కోసం కేసీఆర్ వద్ద పట్టుబడ్డారని తెలుస్తోంది. వరంగల్ తూర్పుతో పాటు పరకాల టిక్కెట్ ఇవ్వాలని కోరారు. తమకు రెండు సీట్లు అడుగుతామని సురేఖ చాలా రోజుల నుంచి చెబుతున్నారు. కేసీఆర్ నో చెప్పారు. వరంగల్ తూర్పు మాత్రమే ఇస్తామని, అది కూడా సురేఖకే ఇస్తామని చెప్పారు. పరకాల నుంచి తాను, వరంగల్ తూర్పు నుంచి తన కూతురు సుస్మితా పటేల్‌ను దింపాలని కొండా దంపతులు భావించారు. కాంగ్రెస్ నుంచి హామీ వచ్చిందని సమాచారం. వారు పార్టీ వీడాడాన్ని కేసీఆర్ లైట్‌గా తీసుకుంటున్నారని తెలుస్తోంది. తూర్పులో సురేఖ పోటీ చేస్తే ఓకే లేదంటే వారు పార్టీ వీడినా అభ్యంతరం లేదన్నట్లుగా కేసీఆర్ ఉన్నారని సమాచారం.

    కొండా దంపతుల తీరుపై కేసీఆర్ ఆగ్రహం

    కొండా దంపతుల తీరుపై కేసీఆర్ ఆగ్రహం

    కొండా దంపతుల దూకుడు తీరుపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. గత రెండేళ్లుగా భూపాలపల్లి, పరకాల, వరంగల్ తూర్పు టికెట్లు తమకే కావాలని, తమకు కేటాయిస్తారని చెప్పుకోవడంతో ఆయా స్థానాల్లో ఉన్న సిట్టింగులు ఆందోళనకు గురయ్యారు. ప్రధానంగా తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని కామెంట్ చేయడం, ఆయనపై పూర్తి వ్యతిరేక ప్రచారం కొనసాగించడంతో కేసీఆర్ సీరియస్ అయ్యారని అంటున్నారు. దూకుడు వద్దని హరీష్ రావు చెప్పినా వినలేదని అంటున్నారు.

    కొండా దంపతుల తీరుపై అసహనం

    కొండా దంపతుల తీరుపై అసహనం

    పలు నియోజకవర్గాలు తమకే కావాలని పట్టుబట్టడం, ఆయా నియోజవకవర్గాల్లో పట్టు కోసం ప్రయత్నాలు, వరంగల్ నగర మేయర్‌తో విభేదాలు.. ఇలా పలు అంశాలు కేసీఆర్‌కు ఆగ్రహం తెప్పించాయని చెబుతున్నారు. కేసీఆరే స్వయంగా వరంగల్ తూర్పును పెండింగులో పెట్టారని కొందరు అంటుంటే, కొండా సురేఖ రెండు సీట్లు కోరడంతో పెండింగులో పెట్టారని మరికొందరు అంటున్నారు.

    కూతురుకు టిక్కెట్ కోసం బెట్టు

    కూతురుకు టిక్కెట్ కోసం బెట్టు

    మూడు రోజుల క్రితం వరంగల్‌కు చెందిన పలువురు నేతలు కేటీఆర్‌ను కలిసి కొండా సురేఖకు టిక్కెట్ ఇవ్వవద్దని చెప్పారని తెలుస్తోంది. పలు రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా దంపతులు కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. వారు ఈ రోజు తెరాసకు రాజీనామా చేయనున్నారని సమాచారం. ఒకటికి మించి నియోజకవర్గాల్లో పట్టు కోసం, కూతురుకు టిక్కెట్ కోసం పట్టు కారణంగా సురేఖ తెరాసను వీడే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+