వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిసెంబర్ 9 ప్రకటన ఎందుకు.?ఆనాడు సోనియా గాంధీని ప్రభావితం చేసిన అంశాలేంటి.?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రవేఖర్ రావు ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టడంతో యావత్ తెలంగాణ ప్రజానీకం మేల్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జైకొట్టారు. అదే ఉద్యమం విద్యార్ధి లోకానికి తాకింది. అంతే తెలంగాణ ఇప్పుడు కాకపోతే ఇంకెన్నటికి రాదనే బలమైన భావన తెలంగాణ ప్రజల్లో కలిగింది. దాంతో ఊరూ వాడా జేఏసీలు ఏర్పడ్డాయి. విద్యార్ధులతో, ఉద్యోగులతో, రాజకీయ నేతలతో ఉద్యమం ఎగిసిపడుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్టు ప్రకటించారు.

డిసెంబర్ 9 సోనియా గాంధీ ప్రకటన..

డిసెంబర్ 9 సోనియా గాంధీ ప్రకటన..

సోనియా గాంధీ ప్రకటనతో తెలంగాణ ప్రజానీకం నుండి ఎంత సంఘీభావం వచ్చిందో ఇతర ప్రాంతాల నుండి అంతే వ్యతిరేకత వచ్చింది. దీంతో సోనియా గాంధీ ప్రకటన పట్ల మరోసారి స్పందించారు అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం. ఈ పరంపరలో వాస్తవ పరిస్ధుతుల అధ్యయనం కోసం కేంద్రం శ్రీకృష్ణ కమిటీని నియమించింది.

తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంతంలో పర్యటించి ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా సమయాన్ని నిర్ధారించింది. తర్వాత కమిటీ నివేదిక, తెలంగాణ ప్రజల సహాయనిరాకరణ, ఓ పక్క ప్రత్యక తెలంగాణ ఉద్యమం, మరో పక్క సమైఖ్యాంధ్ర ఉద్యమాలు రెండు ప్రాంతాల్లో జోరందుకున్నాయి.

సోనియా గాంధీని ప్రభావితం చేసిన ఆత్వహత్యలు..

సోనియా గాంధీని ప్రభావితం చేసిన ఆత్వహత్యలు..

ఈ నేపథ్యంలో సోనియా గాంధీకి నిఘా విభాగం నుండి కొంత సమాచారం వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసింది. అనంతరం సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకోవడంతో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన ప్రకటనను నిలిపివేస్తున్నట్లు డిసెంబర్ 23న ప్రకటించింది. దాంతో తెలంగాణ ప్రాంతం ఒక్కసారిగా భగ్గుమంది. అన్ని వర్గాల ప్రజలంతా ఏక తాటిమీదకొచ్చి చంద్రశేఖర్ రావుకు అండగా నిలబడి తెలంగాణ రాష్ట్ర సాధనకు సంఘీభావం ప్రకటించారు.

రణరంగమైన ఉస్మానియా..

రణరంగమైన ఉస్మానియా..

తెలంగాణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టారు తెలంగాణ ప్రజలు. ఉస్మానియా యూనివర్పిటీ విద్యార్ధుల నినాదాలతో మారుమోగిపోయేది. ఇటు ఉద్యోగులు సకల జనుల సమ్మెలో పాల్గొని తెలంగాణ ఆకాంక్షను చెప్పకనే చెప్పారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఎటు చూసినా జై తెలంగాణ నినాదాలతో దిక్కులు పెక్కటిల్లాయి. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు మొదలు పెట్టిన మలిదశ తెలంగాణ ఉద్యమం చరిత్ర గతిని మార్చేసింది. యావత్ తెలంగాణ ప్రజానీకం ఒక్కటయ్యారు.

తెలంగాణ తల్లిగా సోనియా ప్రశంసలు..

తెలంగాణ తల్లిగా సోనియా ప్రశంసలు..

సహాయ నిరాకరణ, విద్యార్థుల ఆత్మహత్యలు, ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు, ఆంధ్ర బస్సుల దహనాలు వంటి హింసాత్మక పరిణామాలు అప్పుడప్పుడే చోటు చేసుకుంటున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో సోనియా గాంధీకి అందిన నిఘా వర్గాల నివేదికతో తెలంగాణ ఏర్పాటు అనివార్యమైంది.

దీంతో రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యంగపరమైన చర్యలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఉద్యమం హింసాత్మకంగా మారకముందే తెలంగాణ ప్రకటన చేయించి ఆగ్రహ జ్వాలలను చల్లార్చారు సోనియా గాంధీ. అందుకే సోనియా గాంధీ డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిందని, ఓ చరిత్రను సృష్టించిందని చర్చించుకుంటారు.

English summary
All Telangana people woke up as Telangana Rashtra Samithi president Kalvakuntla Chandravekhar Rao embarked on a death hunger strike for a separate Telangana state. At the same time, AICC chief Sonia Gandhi announced her readiness to form a Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X