ప్రియురాలితో ఉండగా పట్టుకొని, భర్తకు బడితెపూజ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ భార్య నడి రోడ్డు పైన భర్తను చితకబాదింది. బోరబండలో వివాహేతర సంబంధం పెట్టుకున్నారంటూ భర్తను భార్య రోడ్డుపై కొట్టిది. ఓ కంపెనీలో ఎలక్ర్టిషన్‌గా పని చేస్తున్న శివయ్యకు పద్మతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది.

మాదాపూర్‌లో నివాసముంటున్న శివయ్య మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత కొద్ది రోజులుగా ఇంటికి కూడా రావడం మానేసిన శివయ్యను గమనించిన భార్య పద్మ ఆరా తీయగా భర్త వివాహేత సంబంధం పెట్టుకున్న విషయం బయటపడింది.

మహిళ ఇంట్లోనే భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య పద్మ బంధువులతో కలిసి రోడ్డుపైనే చితకబాదింది. అనంతరం పోలీసులకు అప్పగించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Wife Beats Husband For Having Extra Marital Affair

భార్యాపిల్లలకు విషమిచ్చిన భర్త: చిన్నారులు మృతి

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం ఊరెల్లలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపిల్లలకు విషమిచ్చి వారిని హత్యచేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆనందం, లక్ష్మీ కుటుంబం కోళ్లఫాంలో పనిచేస్తూ అక్కడే జీవనం సాగిస్తున్నారు.

వీరికి లావణ్య(3), శిరీష్‌(2)అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే గత కొద్ది కాలంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వీరిద్దరి మధ్యా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి భార్య, పిల్లలకు అన్నంలో విషం కలిపి తినిపించాడు. దీంతో చిన్నారులు నిద్దరలోనే చనిపోగా, భార్య లక్ష్మీ వాంతులు చేసుకోగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+