భార్యే చేసింది..: ప్రియుడితో వివాహేతర సంబంధం, భర్తను బలితీసుకంది!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే హత్య చేయించిందో భార్య. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండలో ఈ దారుణం చోటు చేసుకుంది. హత్య చేయడమే కాకుండా.. దాన్ని రైలు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో.. ఎట్టకేలకు నిజాలు నిగ్గు తేలక తప్పలేదు.

 ప్రియుడి వ్యామోహంలో:

ప్రియుడి వ్యామోహంలో:

బోరబండ స్వరాజ్‌నగర్‌కు చెందిన ఎండీ ఖాజా(46), సలేహా బేగం(26) భార్యాభర్తలు. 11ఏళ్ల క్రితం వీరిద్దరికి వివాహం జరిగింది. నవాజ్‌(9), లతీఫ్‌(7) అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో బోరబండలోని ఓ మాంసం దుకాణంలో పనిచేసే ఎండీ తబ్రేజ్‌ఖురేషీ(33)తో సలేహాకు కొన్నాళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

హత్యకు సుపారీ:

హత్యకు సుపారీ:

భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసి.. భర్త పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. సరికదా, భర్తనే అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఖురేషీతో కలసి కొంతమంది రౌడీ షీటర్లను రంగంలోకి దించింది.

ఖాజా హత్య కోసం బోరబండ సఫ్దర్‌నగర్‌కు చెందిన పాత నేరస్తుడు సయ్యద్‌ ముజీబ్‌తో రూ.2లక్షల ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.హత్య తర్వాత మిగతాది చెల్లిస్తామని చెప్పి.. మొదట రూ.30వేలు ముట్టజెప్పారు.

ఖాజాకు దగ్గరైన ముజీబ్:

ఖాజాకు దగ్గరైన ముజీబ్:


ఖాజాను హత్య చేసే క్రమంలో మొదట అతనికి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు ముజీబ్. ఖాజా రోజూ వెళ్లే మద్యం దుకాణం వద్దకు వెళ్లి.. అతనితో మాటా మాటా కలిపేవాడు. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.

ఈ క్రమంలోనే ఖాజా హత్య కోసం మరో ముగ్గురిని రంగంలోకి దించాడు ముజీబ్. బోరబండకు చెందిన ఎండీ అయాజ్, ఎర్రగడ్డకు చెందిన మీర్జా అక్బర్‌ బేగ్, బోరబండ సైట్‌ 3 అంబేడ్కర్‌నగర్‌కు చెందిన షేక్‌ జహీర్‌లతో హత్యకు ఒప్పందం చేసుకున్నాడు.

ఇలా హత్య:

ఇలా హత్య:

ఖాజా హత్య కోసం ఫిబ్రవరి 20న ప్లాన్ వేశారు. అనుకున్నట్టుగానే ఆరోజు ఖాజాను మద్యం తాగేందుకు తీసుకెళ్లాడు ముజీబ్. మాదాపూర్ లోని ఓ మద్యం దుకాణంలో మద్యం తాగి.. తిరిగి వస్తూ మరికొంత మద్యం కొనుగోలు చేశారు. రాత్రి 9.40గం. సమయంలో వివేకానందనగర్‌ కమాన్‌ వద్ద ఆగారు. ఆ సమయంలోనే మద్యం సేవించాలని భావించారు. కానీ ఇక్కడైతే పోలీసులు వస్తారని చెప్పి.. సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లాడు ముజీబ్.

ప్రమాదంగా చిత్రీకరించారు:

ప్రమాదంగా చిత్రీకరించారు:

ముజీబ్, ఖాజా మద్యం తాగుతున్న సమయంలోనే..రియాజ్, అక్బర్, జహీర్‌ వీరిని అనుసరించారు. ఖాజా మద్యం మత్తులోకి జారుకున్నాక.. బండరాయితో మోది అతన్ని చంపేశారు. ఆపై రైలు పట్టాల మీద పడేసి వెళ్లిపోయారు. దీంతో మద్యం మత్తులో పట్టాలు దాటుతూ చనిపోయాడన్న కట్టు కథ ప్రచారంలోకి వచ్చింది. అయితే పోస్టుమార్టం నివేదికలో.. మృతుడి తలకు తీవ్ర గాయాలైనట్టు తేలడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

కాల్ డేటా పట్టించింది:

కాల్ డేటా పట్టించింది:

ఖాజా కాల్ డేటాను పరిశీలించగా.. సలేహా ప్రియుడు తబ్రేజ్ ఖురేషీ ముజీబ్‌తో ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడినట్టు తేలింది. హత్య జరిగిన సమయంలో తబ్రేజ్ కూడా అక్కడే ఉన్నట్టు సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా గుర్తించారు. దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని ఆరా తీయగా.. అసలు నిజాలు బయటపడ్డాయి. ఖాజా భార్య సలేహా కూడా నిజాలను అంగీకరించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Saleha, A 26years old woman was planned to murder her husband on Feb 21st. Her lover Tabrez was killed him

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి