భర్తను చంపించిన భార్య: నమ్మించి, తాగించి, పక్కా ప్లాన్‌తో...

Posted By:
Subscribe to Oneindia Telugu

వరంగల్: భర్తను హత్య చేసిన భార్య ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. తాగుడుకు బానిసై తనను పెడుతున్న వేధింపులను తట్టుకోలేక ఆమె తన భర్తను చంపించింది. తల్లిదండ్రులు కలిసి కిరాయి హంతకులతో అతన్ని చంపేసింది.

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఖాజీపేట ఏసీపీ కె.సత్యనారాయణ వివరాలను మీడియాకు వివరించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.

అనుమానిస్తూ వేధించేవాడు..

అనుమానిస్తూ వేధించేవాడు..

భర్త బోజిరెడ్డి మద్యానికి బానిసై భార్య సుజాత మీద అనుమానం పెంచుకున్నాడు. దాంతో ఆమెను నిత్యం వేధిస్తూ వచ్చాడు. దానికితోడు, మామ ఆస్తిలో తన భార్యకు వాటా ఇవ్వాలని కూడా వేధిస్తూ వస్తున్నాు. ఈ క్రమంలో అతనికి భూపాలపల్లి నుంచి ఛత్తీస్‌గడ్‌కు బదిలీ అయింది. దాంతో విధులకు వెళ్లడం మానేసి మద్యం తాగి వచ్చి భార్యను వేధిస్తూ వచ్చాడు.

వారికి పదేళ్ల క్రితం వివాహం

వారికి పదేళ్ల క్రితం వివాహం

కరీంనగర్‌కు చెందిన మూల సుధాకర్‌రెడ్డి సులోచన దంపతులకు ముగ్గురు కూతుళ్లు. రెండో కూతురు సుజాతకు కరీంనగర్‌లోని సప్తగిరికాలనీకి చెందిన ముదుగంటి బోజిరెడ్డితో పదేళ్ల క్రితం పెళ్లి చేశారు వీరికి 8 ఏళ్ల వయస్సు గల కూతురు కూడా ఉంది. బోజిరెడ్డి బేయర్‌ కంపెనీలో టీపీఎంగా భూపాలపల్లిలో పనిచేస్తూ వచ్చాడు. భార్య సుజాత ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది.

మకాం మార్చారు, అయినా...

మకాం మార్చారు, అయినా...

చివరకు కరీంనగర్‌కు మకాం మార్చారు. అయినా బోజిరెడ్డిలో మార్పు రాలేదు. దీంతో అతన్ని హత్య చేయాలని భార్య సుజాత, ఆమె తండ్రి సుధాకర్‌రెడ్డి, తల్లి సులోచన పథకం వేసుకున్నారు. భూపాలపల్లి నుంచి కరీంనగర్‌కు డీసీఎంలో ఇంటి సామగ్రిని తరలిస్తున్న సమయంలో భూపాలపల్లికి చెందిన వ్యాన్‌ డ్రైవర్‌ దిండి కొండల్‌తో బోజిరెడ్డి భార్య సుజాతకు పరిచయమైంది.

అతని సహాయంతో హత్య.

అతని సహాయంతో హత్య.

గత సెప్టెంబర్‌ 1వ తేదీన హన్మకొండలోని పబ్లిక్‌ గార్డెన్‌కు కొండల్‌ను పిలిచి బోజిరెడ్డి హత్య గురించి సుజాత, ఆమె తండ్రి సుధాకర్‌రెడ్డి చర్చించారు. వారం రోజుల తర్వాత పరకాలలో మరోసారి కలిశారు. కొండల్‌ అందుకు రూ.4లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. చివరకు రూ.1.4లక్షలకు ఒప్పందం కుదిరింది. అడ్వాన్స్‌గా రూ.10వేలు ఇచ్చారు.

ఇలా ప్లాన్‌ను అమలు చేశారు...

ఇలా ప్లాన్‌ను అమలు చేశారు...

సుజాత సెప్టెంబర్‌ 18న భర్తకు నచ్చజెప్పి లక్నవరం సందర్శించి మేడారం తీసుకెళ్లింది. అక్కడ ఓ గదిని తీసుకున్నారు. సుధాకర్‌రెడ్డి, కొండల్‌, పరకాలకు చెందిన మడికొండ ప్రవీ ణ్‌, చిట్యాల మండలంలోని గోపాల్‌పూర్‌కు చెందిన కంకనాల రాజు అలియాస్‌ రాజ్‌కుమార్‌ డీసీఎంలో మేడారం చేరుకున్నారు.

మామనే అతనితో మద్యం తాగించాడు

మామనే అతనితో మద్యం తాగించాడు

మామ సుధాకర్ రెడ్డి జోజిరెడ్డికి మద్యం తాగించాడు. ఆ తర్వాత ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. దాంతో బోజిరెడ్డి స్పృహ తప్పాడు. అతన్ని వ్యాన్‌లో కమలాపూర్‌ మండలంలోని వంగపల్లి వంతెన వద్దకు రాత్రి తీసుకెళ్లి చంపేశారు. శవాన్ని వంతెన వద్ద వదిలివేసి డీసీఎంలో కరీంనగర్‌ వెళ్లి మిగతా రూ.1.3లక్షలు ఇచ్చేశారు.

పోలీసులకు సమాచారం అందింది

పోలీసులకు సమాచారం అందింది

19న ఉదయం వంగపల్లి బ్రిడ్జిపై మృతదేహం ఉందనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఆధారాల ప్రకారం బోజిరెడ్డి భార్య సుజాతకు సమాచారం ఇచ్చారు. అక్కడ ఆమె తప్పుడు ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు విచారించడంతో విషయం వెల్లడై సుజాత, ఆమె తండ్రి సుధాకర్‌రెడ్డి కమలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman sujatha killed her husband with the help of her parents and others inn Warangal urban district of Telangana.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి