ప్రియుడితో కలిసి భర్తను చంపేసి శవాన్ని ఇంట్లో పాతిపెట్టింది

హైదరాబాద్: ఓ మహిళ భర్తను చంపేసి ఇంట్లోనే పాతి పెట్టింది. మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండలం పోతులబొగుడాలో ఈ దారుణ సంఘటన జరిగింది. మృతదేహం నుంచి వస్తున్న దుర్వాసనను స్థానికులు గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. ప్రియుడి సహాయంతో ఆమె తన భర్తను చంపినట్లు తెలుస్తోంది.
వ్యభిచారగృహంపై దాడి
హైదరాబాదులో పోలీసులు ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరు మహిళలను, ఓ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. గాజుల రామారాం డివిజన్ లాల్ సాహెబ్ గుడాలో జీడిమెట్లకు చెందిన సుల్తాన్ (48) అనే వ్యక్తి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకుని వచ్చి వ్యభిచారం చేయిస్తున్నాడు. విషయం తెలుసకున్న పోలీసులు శనివారంనాడు వ్యభిచార గృహంపై దాడి చేశారు. మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు.
అధికారి రాక్షసానందానికి దంపతులు బలి
కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకిలో సంఘటన చోటుచేసుకుంది. ఓ అధికారి రాక్షసానందం వల్ల ఇద్దరు దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన శనివారం బెజ్జంకిలో చోటుచేసుకుంది. బెజ్జంకి తహసీల్దార్ తమ పాసు పుస్తకాలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ అదే మండలానికి చెందిన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బ్యాంక్ మేనేజర్‌పై అటెండర్ హత్యాయత్నం
కరీంనగర్ జిల్లాలోని కమాన్‌పూర్ మండలంలో దక్కన్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రామానుజాచారిపై హత్యాయత్నం జరిగింది. బ్యాంకు అటెండర్ శ్రీకాంత్ ఆయనను కత్తితో పొడిచి హత్య చేసేందుకు యత్నించాడు. ఈ సంఘటనలో బ్యాంకు మేనేజర్ రామానుజాచారి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications