చంపేస్తానని బెదిరిస్తున్నాడు: భర్తపై ఓ ఓ భార్య
హైదరాబాద్: తన పిల్లలను అపహరించి తనను కూడా హత్య చేస్తానని భర్త బెదిరిస్తున్నాడని ముజీబ్ పహిల్వాన్ భార్య మెహజబీన్ ఆరోపించారు. సోమవారం హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మెహజబీన్‌తో పాటు ఆమె సోదరి ఆలియా, తల్లి అజీమా ఖాతూన్, పీయూసీఎల్ ప్రధాన కార్యదర్శి జయవింధ్యాల పాల్గొన్నారు.
ముజీబ్ పహిల్వాన్ తమను బెదిరించి మొదట తన సోదరి ఆసియాను 1998లో బలవంతంగా లొంగదీసుకున్నాడని, అనంతరం ఆమెను వదిలేసి 1999లో తనను కూడా బలవంతంగా లొంగదీసుకున్నాడని, కొద్దిరోజులకు పెళ్లి చేసుకున్నాడని మొహజబీన్ చెప్పారు. తనను వేధిస్తుండడంతో రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నానని తెలిపింది.

ఫిబ్రవరిలో జహనుమాలో గల గుడ్‌ఫెత్ హై స్కూల్‌లో చదువుకుంటున్న కుమారుడు యహ్యా(14), కూతురు ఆయేషా (8)లను కిడ్నాప్ చేశాడని, అప్పటి నుంచి తనను కూడా హత్య చేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పింది. దీంతో బార్కస్ లో ఉంటున్న సోదరి ఆలియా ఇంట్లో తలదాచుకుంటున్నానన్నారు. ఇ
క్కడ ఉంటున్న విషయం తెలుసుకున్న ముజీబ్ సోమవారం ఉదయం 8 గంటల సమయంలో కూతురు అయేషాను బా ర్కస్ వద్ద వదిలేసి తనను 10 గంటలలోపు రా వాలని హెచ్చరించి వెళ్లిపోయాడన్నారు. తాను వెళ్లకపోతే అక్క అలియా ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి అందరినీ చంపేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. పీయూసీఎల్ నాయ కురాలు జయవింధ్యాల సహాయంతో చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది.












Click it and Unblock the Notifications