ఫ్రెండ్ చెల్లెలితో వివాహేతర సంబంధం: టెక్కీ భర్తపై అనుమానం, భార్య ఆత్మహత్య
హైదరాబాద్: భర్తపై అనుమానంతో ఓ భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం బూరాన్ పూర్ ప్రాంతానికి చెందిన నీరుడు సుధాకర్ హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.
ఇతగాడికి అనూష (27) అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి అనంతరం హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ జానకీనగర్‌లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బీటెక్ చదివిన అనూష పెళ్లికి ముందుకు ఉద్యోగం చేసింది. అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఆమె ఇంట్లోనే ఉంటోంది.
అయితే గత కొంతకాలంగా అనూష భర్త సుధాకర్ అతని స్నేహితుడి చెల్లెలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు అనూష గుర్తించింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ప్రియురాలి సెల్‌ఫోన్‌కు రీచార్జి చేయించడంతో భార్యాభర్తల మధ్య ఘర్షణ మరింత పెరిగింది.

దీంతో గురువారం వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో భర్త తనను మోసం చేస్తున్నాడన్న అనుమానం ఆమెను పెనుభూతంగా మార్చింది. అతడు ఉద్యోగానికి వెళ్లగానే బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. దీనిని గమనించిన ఇంటి ఓవర్ జరిగిన విషయాన్ని సుధాకర్‌కు ఫోన్ చేసి చెప్పాడు.
దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications