విజయ్ అంత్యక్రియలకు రాని భార్య, కూతుర్నీ తీసుకురాలేదు, 'విడాకులకు రూ.3 కోట్లు'
హైదరాబాద్: నటుడు విజయ్ సాయి అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం ఈఎస్ఐ స్మశాన వాటికలో జరిగాయి. అతని భార్య, వనిత, కూతురు లేకుండానే ఈ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆత్మహత్య చేసుకున్న అతని మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
Recommended Video

ఆ తర్వాత మంగళవరం యూసుఫ్‌గూడలోని శ్రీనివాసం విలేజ్ అపార్టుమెంట్ వద్దకు తీసుకు వచ్చారు. అభిమానుల సందర్శనార్థం మృతదేహాన్ని అపార్టుమెంట్ కింది భాగంలో ఉంచారు. దర్శకులు రవిబాబు, నటుడు ఉత్తేజ్ తదితరులు ఇక్కడికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.

చివరి చూపుకు రాలేదు
విజయ్ భార్య వనిత చివరిచూపు చూడటానికి, కుమార్తె కుందనకు తండ్రిని చూపించేందుకు వస్తుందని అందరూ ఊహించారు. కానీ ఆమె రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్యనే విజయ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. విజయ్‌కు తన కుమార్తె కుందన అంటే ఎంతో ప్రాణమని, కోర్టు అనుమతితో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చూసేందుకు వెళ్లేవాడని బంధువులు తెలిపారు.

కూతురును తీసుకు రాకపోవడంపై ఆగ్రహం
చివరి చూపుకు కుమార్తెను తీసుకురాకపోవడంపై బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. భార్య వనితారెడ్డి వేధింపులు, కుమార్తెను అతని దగ్గరకు రానీయకపోవడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని పెదనాన్న, సోదరుడు ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో విలేకరులకు తెలిపారు.

కేసు నమోదు
విజయ్ ఆత్మహత్య కేసులో అతని భార్య వనితతో పాటు, లాయర్ శ్రీనివాస్, శశిధర్‌లపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్ సెల్ఫీ వీడియోలను స్వాధీనం చేసుకున్నామని వాటిని ఫోరెన్సిక్ నివేదికకు పంపుతామని పోలీసులు తెలిపారు.

మెడ నరాలు తెగిపోవడం వల్ల మృతి
విజయ్ మెడ నరాలు తెగిపోవడం వల్లనే మృతిచెందాడని వైద్యులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడిన విజయ్ మెడ నరాలు తెగిపోవడంతోపాటు ఎముక విరిగిందని తద్వారా కోమాలోకి వెళ్లి మృతిచెంది ఉంటాడని పోలీసులకు ప్రాథమిక నివేదిక ఇచ్చారని తెలుస్తోంది.

విడాకుల కోసం రూ.3 కోట్లు డిమాండ్
మరోవైపు విజయ్ తండ్రి కేవీ సుబ్బారావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వనిత విడాకులు ఇవ్వడానికి రూ. 3 కోట్లు డిమాండ్ చేసిందని పేర్కొన్నారు. వనిత, లాయర్ శ్రీనివాస్, శశిధర్ కలిసి ఈ విషయంలో వేధింపులకు గురిచేశారంటూ తన కుమారుడు తనతో చెప్పాడన్నారు. వారి వేధింపులను తట్టుకోలేక విజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. వనిత, శ్రీనివాస్, శశిధర్‌లు ఈ మృతికి బాధ్యులు అన్నారు.
-
విజయ్ కు బిగ్ షాక్.. -
విజయ్ను భయపెట్టిన అభిమాని.. సైకిల్ ఆపి పరుగో పరుగు! వీడియో -
త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు.. టెన్షన్ లో విజయ్..? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!!












Click it and Unblock the Notifications