అజారుద్దీన్ మంత్రి పదవి ఎన్నాళ్లు - ఊహించని పరిణామాలు..!?

మంత్రిగా అజారుద్దీన్ ఎంత కాలం ఉండనున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ అనూహ్యంగా అజారుద్దీన్ కు మంత్రి పదవి దక్కింది. ఏ సభలోనూ సభ్యుడి కాని అజారుద్దీన్ పేరును ప్రభుత్వం అనూహ్యంగా గవర్నర్ కోటాలో ఎంపిక చేసింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆరు నెలల్లోగా సభకు ఎంపిక కావాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలతో అసలు అజారుద్దీన్ కు ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా.. మంత్రిగా సమస్య తప్పదా అనే చర్చ పార్టీలో మొదలైంది.

మంత్రిగా అజారుద్దీన్ పైన కొత్త చర్చ మొదలైంది. కాంగ్రెస్ లో పలువురు సీనియర్లు మంత్రి పదవులు ఆశించారు. అయితే, ఖైరతాబాద్ ఉప ఎన్నిక సమయంలో అనూహ్యంగా అజారుద్దీన్ కు మంత్రి పదవి దక్కింది. సీనియర్లు ఇద్దరికి కీలక పదవులు అప్పగించారు. త్వరలోనే పూర్తి స్థాయి లో విస్తరణ ఉంటుందని ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యుల మధ్య చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో ఏ సభలోనూ సభ్యుడిగా కాకుండా మంత్రి పదవి దక్కించుకున్నఅజారుద్దీన్ కు ఫిక్స్ చేసిన ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా లేదా అనే కొత్త అంశం తెర మీదకు వచ్చింది. ఆరు నెలల్లోగా అజారుద్దీన్ చట్ట సభ నుంచి సభ్యుడు కావాల్సి ఉంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం ఇప్పుడు అజారుద్దీన్‌కు పెద్ద సమస్యగా మారుతోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్ తిరస్కరించడంపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

will-azharuddin-continue-as-minister-in-telangana-cabinet-new-debate-in-political-circles

ఈ వివాదం కొనసాగుతుండగా నే, రేవంత్ ప్రభుత్వం కోదండరామ్, అజారుద్దీన్ పేర్లను గవర్నర్ కోటాకు సిఫారసు చేసింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఏప్రిల్ లోపు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉండదు. మరో వైపు రాష్ట్రంలో వచ్చే ఏడాది నవంబర్ వరకు కొత్తగా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. కేవలం గవర్నర్ కోటా మాత్రమే ఆయనకు ఉన్న ఏకైక మార్గం. ఒకవేళ కోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే, ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

అయితే.. సుప్రీం కోర్టులో చోటు చేసుకునే పరిణామాల ఆధారంగా సీఎం రేవంత్ నిర్ణయం తీసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, అజారుద్దీన్ ను ఎమ్మెల్సీ చేయాలంటే ప్రస్తుతం ఉన్న వారిలో ఎవరితో అయినా రాజీనామా చేయించాలి. అది సాధ్యపడే అంశంగా కనిపించటం లేదు. ఇక.. ప్రొఫెసర్ కోదండరామ్ పరిస్థితి కూడా సందిగ్ధంలో పడింది. ఆయన కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో.. ఇప్పుడు ప్రభుత్వం.. పార్టీ నేతలు సుప్రీంలో వచ్చే నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+