తెలంగాణ ఎన్నికలు, రంగంలోకి అమిత్ షా: బీజేపీ చీఫ్‌తో పరిపూర్ణానందస్వామి భేటీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ అసెంబ్లీ రద్దు మొదలు అన్నీ ఆశ్చర్యపోయే అంశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత తొలిసారి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు జతకలిశాయి.
తాజాగా మరో అంశం వెలుగు చూసింది. శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా నుంచి పిలుపు వచ్చింది. సోమవారం అత్యవసరంగా ఢిల్లీకి రావాలని చెప్పారు. బీజేపీ అధిష్టానం నుంచి పరిపూర్ణానందకు పిలుపు వచ్చిందనే విషయం తెలియగానే ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం
తెలంగాణలో బీజేపీ ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. సీఎంగా లేదంటే ఎంపీగా అయినా ఆయనను పోటీ చేయించాలని బీజేపీ భావిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. తన రాజకీయ రంగ ప్రవేశంపై పరిపూర్ణానంద గతంలో పలుమార్లు ప్రకటన చేశారు. పరిపూర్ణానంద పలు అంశాలపై పోరాడినప్పుడు కొన్ని పార్టీల నాయకులు.. ఆయనకు రాజకీయాల్లోకి రావాలని ఉందేమోనని, యూపీ యోగి ఆదిత్యనాథ్‌లా సీఎం కావాలని ఉందేమోనని వ్యాఖ్యానించారు. వాటిపై స్పందించిన పరిపూర్ణానంద, తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని, కానీ ఆయా పార్టీల నేతలు మాట్లాడుతుంటే ఆ భగవంతుడే వారితో అలా పలికిస్తున్నాడని తనకు అనిపిస్తోందని, వారి మాటలు నిజం అవుతాయేమోనని అన్నారు. తన రాజకీయ రంగ ప్రవేశం అమ్మవారికే వదిలేశానని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్‌లలో ఏది ఆహ్వానిస్తే ఆ పార్టీలోకి వెళ్లేందుకు ఆన సిద్ధంగా ఉన్నారు. దేశం కోసం పని చేస్తానని చెప్పారు.

నగర బహిష్కరణ సమయంలో అండగా బీజేపీ
గతంలో స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నగర బహిష్కరణ చేయడంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అదే సమయంలో హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ అంశం కోర్టుకు చేరడంతో స్వామీజీపై నగర బహిష్కరణను హైకోర్టు ఎత్తివేసింది.

స్వామీజీ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ
ఇధిలా ఉండగా, అమిత్ షా ఆహ్వానం మేరకు పరిపూర్ణానంద స్వామి ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా, పరిపూర్ణానందల మధ్య రాజకీయ చర్చ సాగినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో స్వామీజీ ఢిల్లీ పర్యటన ఉత్కంఠగా మారింది. ఆయన ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తారా, ప్రచారం చేస్తారా అనే చర్చ కూడా సాగుతోంది.
Recommended Video


పరిపూర్ణానందతో లాభిస్తుందా?
పరిపూర్ణానంద స్వామికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఆయన తెలుగు రాష్ట్రాల యోగి ఆదిత్యనాథ్ అవుతారని చాలామంది భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ నుంచి ఆహ్వానం నేపథ్యంలో ఆయన ప్రచారం చేసినా లేక ఆ పార్టీలో చేరినా బీజేపీకి ఏమైనా లాభిస్తుందా అనే చర్చ సాగుతోంది. సీట్లు ఎక్కువగా రాకపోయినప్పటికీ ఓటింగ్ శాతం పెరుగుతుందా అనేదే కీలకంగా మారింది.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications