పవన్ సమర్ధతకు పరీక్ష - తడబడతారా, నిలబెడతారా..!!
ఏపీలో పవన్ టీడీపీతో పొత్తు ఖాయం చేసారు. బీజేపీ(BJP)తో మిత్రపక్షంగా ఉంటూనే టీడీపీ(TDP)తో కలిసారు. బీజేపీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. తానే బీజేపీ నేతలను కలిసి తన నిర్ణయం వెను కారణాలను వెల్లడిస్తాన ని చెప్పుకొచ్చారు. బీజేపీ వైఖరి ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలంగాణలో జనసేన(Janasena) పోటీ చేస్తుందని గతంలోనే పవన్ ప్రకటించారు. ఇక్కడ పవన్ ప్రత్యర్ధి ఎవరు. పవన్(Pawan) ఎవరితో కలిసి వెళ్తారు.
పోటీకి సిద్దమేనా : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Asembly Elections)కు మరో పది రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉండదని..ఎన్ని సీట్లలో పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుందని చంద్రబాబు ఢిల్లీ పర్యటన వేళ ప్రకటించారు. తరువాత చంద్రబాబు(Chandra Babu) అరెస్ట్ సమయంలో పవన్ తాము టీడీపీతో కలిసి వెళ్తామని ఏపీలో వైసీపీ(YCP) పాలన పోవాలని నినదించారు.

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని గతంలోనే ప్రకటించిన పవన్(Pawan) సీట్ల సంఖ్య కూడ ప్రస్తావించారు. ఇప్పుడు అన్ని పార్టీలు తమ అభ్యర్దులను ఖరారు చేస్తున్నాయి. పవన్ మాత్రం ఆ దిశగా ఎటువంటి కార్యాచరణ అమలు చేయటం లేదు. కానీ, తెలంగాణలో మాత్రం జనసేన(Janasena) పోటీ ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
పొత్తులు ఉంటాయా : తెలంగాణలో తమకు ఎవరితోనూ పొత్తు ఉండదని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. బీజేపీ(BJP) నాయకత్వం సైతం తమ అభ్యర్దుల ఎంపిక కసరత్తు వేగవంతం చేసింది. దీంతో, ఇక జనసేనతో పొత్తు లేదనే భావించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా లేదా అనేది మరో చర్చ. ఈ రెండు కలిసి పోటీ చేస్తే ఎవరి ఓట్లకు గండి కొడతారు.
వీరద్దరి పొత్తు బీజేపీ- బీఆర్ఎస్ లో నష్టం చేసేదెవరికి..మేలు చేసెదెవరికి అనే లెక్కలు మొదలయ్యాయి. ఈ ఎన్నికల్లో పవన్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తే కేసీఆర్(KCR) ను లక్ష్యంగా చేసుకుంటారా.. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయమని పిలుపు ఇస్తారా అంటూ ప్రశ్నలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎన్డీఏ(NDA)లో భాగస్వామిగా ఉన్న పవన్ నుంచి బీజేపీ తెలంగాణలో ఏం ఆశిస్తుందనేది స్పష్టత రావాల్సి ఉంది.

చిక్కులు - లెక్కలు : తెలంగాణ నేతలు పొత్తులు వద్దని చెబుతున్న క్రమంలో పవన్ సేవలను తెలంగాణ(Telangana)లో వినియోగించుకోవటం సందేహంగానే కనిపిస్తోంది. దీంతో, వెళ్తే టీడీపీతో లేకుంటే ఒంటరిగానే పవన్ పోటీ చేయాల్సి ఉంటుంది. ఏపీ ఎన్నికలే లక్ష్యంగా పొత్తుల లెక్కలతో ముందుకు వెళ్తున్న పవన్ కు తెలంగాణ రాజకీయం సమర్ధతకు పరీక్షగా మారుతోంది.
ఇన్ని సందేహాలు..చిక్కుల మధ్య అసలు పవన్ తెలంగాణ లో పోటీ విషయంలో తన నిర్ణయం చివరి నిమిషంలో ఎలా ఉంటుందనేది మరో చర్చ. చంద్రబాబు(Chandra Babu) జైలు నుంచి బయటకు వచ్చిన తరువాతనే దీని పైన నిర్ణయం ఉంటుందనేది పార్టీ నేతల అభిప్రాయం. దీంతో, ఇప్పుడు ఏపీపైన గురి పెట్టిన పవన్..తెలంగాణ విషయంలో పోటీకి నిలబడతారా లేదా అనేది చూడాలి..












Click it and Unblock the Notifications