టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేల కొనుగోళ్ళ ఎపిసోడ్ బూమరాంగ్ అవుతుందా? బోలెడు లాజిక్స్.. హాట్ డిబేట్!!
బిజెపిని ఇరికించడం కోసం టిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఆపరేషన్ ను తెరమీదకు తీసుకు వచ్చిందా? ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ లో నాటకీయ పరిణామాలతో చోటు చేసుకున్న ఘటనలు టిఆర్ఎస్ పార్టీ పై అనుమానాలకు కారణంగా మారాయా? ఇక ఇదే టీఆర్ఎస్ పార్టీకి బూమరాంగ్ కాబోతుందా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బీజేపీ ఈ విషయంలో అనేక లాజిక్ లను తెర మీదకు తీసుకువచ్చి ప్రచారం చేస్తుండడం అందర్నీ ఆలోచించేలా చేస్తోంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ ఆపరేషన్.. బీజేపీ ఆపరేషన్ అయితే ఇలా ఉంటుందా?
ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఆపరేషన్ విషయంలో ఆపరేషన్ జరిగిన ప్లేస్ పై చర్చ జరుగుతుంది. ఒకవేళ బేర సారాలు కోసం వచ్చినట్లయితేతటస్థంగా ఉండే ప్లేస్ ని ఎంచుకుంటారు. అత్యంత రహస్యంగా ఆపరేషన్ జరుగుతుందని, ఇలాంటి ఆపరేషన్ చేయాల్సి వస్తేబిజెపి సేఫ్ గా ఉండే ప్లేస్ లను ఎంచుకుంటుంది. కర్ణాటకనో , గోవానో, మహారాష్ట్ర ముంబై లేదా మరో రాష్ట్రాన్ని ఎంచుకుంటుంది. కానీ మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అందరి దృష్టి ఉండే ఫామ్హౌస్ ను ఎంచుకోదు అన్న చర్చ జరుగుతుంది.

టీఆర్ఎస్ నే ప్లాన్ చేసిందా? ప్రచారం వదిలి ఎమ్మెల్యేలు వచ్చింది అధినేతకు తెలీదా?
ఇక ఇదే సమయంలో మునుగోడు లో ప్రచారంలో ఉండాల్సిన నలుగురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ ఎందుకు వచ్చారు. ఏ బూత్ లో ఏం జరుగుతుందో మంత్రి కేటీఆర్ ఇన్చార్జిలతో నిత్యం టచ్ లో ఉంటున్నాడు. అలాంటప్పుడు ప్రచారాన్ని వదిలి కేటీఆర్ అనుమతి లేకుండా ఎమ్మెల్యేలు హైదరాబాద్ కి వస్తారా? ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం టీఆర్ఎస్ చేసిందే అన్నది కూడా చర్చనీయాంశం అవుతుంది.

ఇలాంటి ఆపరేషన్ ఇంత పిచ్చిగా బీజేపీ చేస్తుందా?
ఒకవేళ ఇలాంటి ఆపరేషన్ చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ ఎంచుకునే అవకాశం లేదని కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడున్న వ్యవస్థ పోలీసు, ఇంటలిజెన్స్ తో పాటు అన్ని వ్యవస్థలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి అన్న విషయం బీజేపీకి తెలుసు. ఇక అంత పెద్ద డీల్ చెయ్యాలి అనుకుంటే ఇలాంటి పొరబాటు బీజేపీ చెయ్యదు అన్న చర్చ జరుగుతుంది. ఆ ఫామ్ హౌస్ ప్రస్తుతం ఆపరేషన్ లో ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలలోఒకరైన టిఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిది. ఆపరేషన్ లో పాల్గొన్న ఎమ్మెల్యేలుపోలీసులకు ఎందుకు సమాచారం ఇస్తారు అన్నది కూడా ఆసక్తికర అంశమే.

పోలీసులు ఎందుకు సరిగ్గా వివరాలు చెప్పలేదు? కోర్టు ఎందుకు రిమాండ్ కు నో అన్నది?
అక్కడికి వచ్చిన సిపి స్టీఫెన్ రవీంద్ర ఎందుకు పూర్తి వివరాలు వెల్లడించలేకపోయారన్న చర్చ కూడా జోరందుకుంది. మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సరిగ్గా ఆయన సమాధానాలు ఎందుకు చెప్పలేకపోయారు. ఇక ఈ ఆపరేషన్ లో అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పినా కోర్టు ఎందుకు రిమాండ్ కు నిరాకరించింది. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఎందుకు ఇంత హడావిడి చేశారు అన్నది కూడా చర్చకు కారణంగా మారింది. ఇక ఆపరేషన్ విషయానికి వస్తే నందు అనే వ్యక్తి కిషన్ రెడ్డి ఫాలోవర్ గా చూపిస్తున్నారు. ఇతనికి బిజెపి కన్నా టిఆర్ఎస్ నేతలతోఎక్కువ సంబంధాలు ఉన్నాయని, మంత్రి శ్రీనివాస్ యాదవ్ తో వ్యాపార సంబంధాలు ఉన్నాయని కూడా చర్చ జరుగుతుంది.

బీజేపీని ఇరికించే యత్నం టీఆర్ఎస్ కు బూమరాంగ్ అవుతుందా?
బిజెపి అనగానే స్వామీజీలు, మతాధిపతులు అనే కవరింగ్ వచ్చేలా ఆంధ్రప్రదేశ్ కడపకు చెందిన స్వామీజీని సెట్ చేశారని టాక్ వస్తుంది. ఇలాంటి ఆపరేషన్ చేయాలనుకుంటే బిజెపిలో కేంద్ర మంత్రులనో, పార్టీ లో కీలక నేతలకి అప్పగిస్తారు కానీ ఎవరో ఎవరికీ తెలియని వ్యక్తితో డీల్ చెయ్యరు. ఇక 100 కోట్ల డీల్ అనీ మీడియాలో లీకేజ్ లు ఇచ్చారు కానీ డబ్బు ఎంత అనేది స్పష్టంగా చెప్పలేదు. ఇది క్లియర్ గా టిఆర్ఎస్ పార్టీ బిజెపి మీద బురద చల్లే యత్నమే అని కొందరు చర్చించుకుంటున్నారు. మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ బిజెపి ని డైవర్ట్ చేయడం కోసం ఇటువంటి మైండ్ గేమ్ ఆడుతుందని భావిస్తున్నారు. ఇక ఈ ఆపరేషన్ టిఆర్ఎస్ పార్టీకి పెద్ద బూమరాంగ్ అవుతుందని చర్చిస్తున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications