రోడ్డు ప్రమాదంలో వైరా ఎమ్మెల్యేకు గాయాలు: హైదరాబాద్‌కు తరలింపు
హైదరాబాద్: ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం నల్గొండ జిల్లా మోతె సమీపంలో గురువారం ప్రమాదానికి గురైంది. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఆయన కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే మదన్ లాల్ స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరై తిరిగి హైదరాబాద్ వస్తుండగా చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన కారు డ్రైవర్, ఆయన గన్ మెన్‌లు ఆయన్ని సూర్యాపేటలోని ఆసుపత్రికి తరలించారు.

ఎమ్మెల్యే మదన్ లాల్‌ను పరీక్షించిన వైద్యులు ఆయన నడుం కింది భాగంలో బాగా దెబ్బలు తగిలాయని, మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యేను హుటాహుటిన హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
కాగా, ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ఎమ్మెల్యే వాహనాన్ని ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుర్తించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications