మునుగోడులో నేటితో నామినేషన్ల ఉపసంహరణ: ఊపందుకున్న ప్రచారం; రంగంలోకి హేమాహేమీలు!!

మునుగోడు ఉపఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే, భవిష్యత్తు ఎన్నికలపైనా ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో మునుగోడును హస్తగతం చేసుకోవడం కోసం ప్రధాన పార్టీలన్నీ హోరా హోరీగా ప్రచార పర్వాన్ని సాగిస్తున్నాయి.

నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు

నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు

మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసి, నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయింది. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగియనుంది. నామినేషన్ల దాఖలు, పరిశీలన పూర్తయిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 14 జిల్లాలకు చెందిన 83 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్టు తేలింది.

మొత్తం మునుగోడు ఉప ఎన్నికకు 130 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలన సమయంలో మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి 47 నామినేషన్ లను తిరస్కరించారు. ఇక ప్రస్తుతం ఉన్న మొత్తం 83 నామినేషన్ల నుండి నేడు ఉపసంహరణకు గడువు ముగియనుండటంతో, ఎన్ని నామినేషన్ ఉపసంహరించుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది.

టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూకుడు .. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మంత్రులు

టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూకుడు .. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మంత్రులు

టిఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తికానున్న నేపథ్యంలో ప్రచార పర్వం ఇప్పటికే జోరందుకుంది టిఆర్ఎస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కోసం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామగ్రామాన పర్యటిస్తూ ఓటర్ల మనసును గెలుచుకున్న ప్రయత్నం చేస్తున్నారు.

మునుగోడు విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని యత్నిస్తున్న టీఆర్ఎస్

మునుగోడు విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని యత్నిస్తున్న టీఆర్ఎస్

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు ఓటు వేయకూడదో వివరిస్తూ టిఆర్ఎస్ కు ఓటు వేయడం వల్ల చేకూరే ప్రయోజనాలు తెలుపుతూ ప్రచారం చేస్తున్నారు. ఇక టిఆర్ఎస్ పార్టీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ ఎన్నికల ప్రచార పర్వంలో తమదైన దూకుడును సాగిస్తున్నారు. ఎలాగైనా మునుగోడు ఎన్నికల విజయాన్ని టీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసం ఎన్నికల ప్రచార బరిలోకి బండి సంజయ్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసం ఎన్నికల ప్రచార బరిలోకి బండి సంజయ్

ఇక బిజెపి నుండి ఎన్నికల బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసం నేటి నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసం ఎన్నికల ప్రచార పర్వం నిర్వహించగా, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ ముఖ్య నాయకులు కూడా నేటి నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

పాల్వాయి స్రవంతి కోసం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

పాల్వాయి స్రవంతి కోసం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన పాల్వాయి స్రవంతి సైతం ప్రచారాన్ని సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల ప్రచారం కోసం టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇక నామినేషన్ల పర్వం పూర్తయి నేటితో నామినేషన్లకు కూడా ఉపసంహరణ గడువు ముగియనుండటంతో దూకుడుగా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎవరికి వారు సరికొత్త వ్యూహాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+